ICC WT20I rankings: భారత క్రికెటర్ దీప్తి శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ దీప్తి శర్మ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది. అగ్రస్థానంలో ఇంగ్లాండ్ క్రికెటర్ సోఫీ ఎక్లెస్టోన్ కొనసాగుతోంది. ఆమెకు, దీప్తికి మధ్య ఉన్న అంతరం 26 పాయింట్లు మాత్రమే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో 5.83 ఎకానమీ రేటుతో 8 వికెట్లు తీసి టాప్ లో కొనసాగుతోంది దీప్తి. ఇదే సిరీస్ లో 4 వికెట్లు పడగొట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్ మ్లాబా ఐసీసీ ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి ఎగబాకింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ సారా గ్లెన్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు దిగజారి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మేగాన్ షుట్ ఆరు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌ క్రీడాకారిణి కేథరిన్‌ బ్రంట్‌ కూడా రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి ఎగబాకింది. భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజేశ్వరి గయక్వాడ్ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌కు చేరుకుంది. ఈ సిరీస్‌లో గయాక్వాడ్‌కు కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసింది. అయితే 3.27 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేసింది.


బ్యాటర్లు విషయానికొస్తే..
మరో వైపు ఆసీస్ ప్లేయర్ తహ్లియా మెక్‌గ్రాత్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానం కైవసం చేసుకుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ స్మతి మందన్నా మూడో ర్యాంకులో కొనసాగుతోంది. బ్యాటర్లలో దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ నాలుగు స్థానాలు ఎగబాకి టాప్ 10లోకి దూసుకెళ్లింది. ఈమె 9వ ర్యాంకు దక్కించుకుంది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి అలిస్సా హీలీ ఒక స్థానానికి దిగజారి 10వ ర్యాంక్‌కు చేరుకుంది. ఆల్ రౌండర్ల జాబితాలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎల్లీస్ పెర్రీ 10వ స్థానాన్ని కైవసం చేసుకుంది.


Also Read: IND vs NZ: భారత్- న్యూజిలాండ్ మధ్య నిర్ణయాత్మక టీ20 నేడే.. మరి సిరీస్ ఎవరిదో? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.