క్రికెట్ ( Cricket  ) ట్రెండ్ నే మార్చేసిన లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League).  ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైనా టోర్నమెంట్ లలో ఒకటి ఐపిఎల్. ఐపిఎల్ వస్తోంది అంటే అటు ప్రేక్షకులు, ఇటు ఫ్రాంచైజీలు, బీసీసీఐ, ఐసీసీ, ప్లేయర్స్, గ్రౌండ్ నిర్వాహకులు, కేబుల్ టీవీ ఛానెల్ వాళ్లు అందరూ లాభపడతారు. అయితే ఈ సారి కోవిడ్-19 ( Covid-19 ) వల్ల లీగ్ జరుగుతుందో లేదో అని చాలా మంది టెన్షన్ పడ్డారు. కానీ చివరికి ఐపిఎల్ 2020 ని యూఏఈలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆటగాళ్లు ప్రాక్టిస్ కూడా ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Wierd: కోడి కూసిందని.. యజమానికి జరిమానా వేశారు


ఐపిఎల్ ( IPL 2020 ) మ్యాచులను ఒక స్పోర్ట్ టీవీ ఛానెల్ ప్రసారం చేస్తోంది. మ్యాచు జరిగే సమయంలో, బ్రేకుల్లో, మ్యాచుకు ముందు, మ్యాచు తరువాత రిపీట్ టెలికాస్టింగ్ సమయంలో.. ఇలా అన్ని సందర్భాల్లోనూ యాడ్స్ టెలికాస్ట్ అవుతాయి. పెద్ద పెద్ద బ్రాండ్లు తమ ప్రకటన కనిపించేందుకు ప్రయత్నిస్తాయి. దీని కోసం పది సెకన్ల కోసం రూ.12.5 లక్షలు చార్జ్ చేయాలి అని నిర్ణయించారట. ఈ లెక్క చూసుకుంటే మొత్తం సీజన్లో టీవీ ఛానెల్ ఎంత సంపాదింంచనుంది అని లెక్కలు వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.



Home Making : బల్లులతో ఇబ్బందా.. ఇలా చేయండి