ఇండియన్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై సస్పెన్షన్ వేటు
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మరో రెజ్లర్‌కు షోకాజ్ నోటీసు అందింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఈ ఇద్దరూ చేసిన నేరమేంటి..సస్పెన్షన్ వేటు ఎందుకు పడింది.
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మరో రెజ్లర్‌కు షోకాజ్ నోటీసు అందింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఈ ఇద్దరూ చేసిన నేరమేంటి..సస్పెన్షన్ వేటు ఎందుకు పడింది.
టోక్సో ఒలింపిక్స్(Tokyo Olympics)లో భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ , సోనమ్ మాలిక్‌లపై క్రమశిక్షణ రాహిత్యం, విపరీత ధోరణితో ప్రవర్తించడం వంటి ఆరోపణలున్నాయి. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో వినేశ్ ఫోగాట్ క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. హంగేరీ నుంచి శిక్షణకు వెళ్లిన వినేశ్..అక్కడి నుంచి నేరుగా టోక్యోకు చేరింది. కానీ ఇండియన్ టీమ్ బస చేసిన క్రీడా గ్రామంలో బస చేయకుండా..వెలుపల హంగేరీ కోచ్, సహాయకులతో స్టే చేసింది. భారత ఇతర మహిళా రెజ్లర్లు సోనమ్, సీమా, అన్షుల నుంచి కరోనా సోకే ప్రమాదముందని వారితో కలిసి ప్రాక్టీస్ కూడా చేయలేదు. అంతేకాదు..ఒలింపిక్స్ రెజ్లింగ్ బౌట్‌లలో టీమ్ ఇండియా అధికారిక జెర్సీల్ని కాకుండా వేరే జెర్సీలు ధరించి బరిలో దిగింది. ఈమె వ్యవహారశైలి, బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించడంతో భారత రెజ్లింక్ సమాఖ్యకు ఆగ్రహం తెప్పించింది. కఠిన చర్యలకు దిగింది. ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు డబ్ల్యూఎఫ్ఐ (WFI)అధికారులు. ఏ విధమైన రెజ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా బ్యాన్ చేశారు. సంజాయిషీ కోసం వినేశ్ ఫోగాట్‌కు(Vinesh Phogat) ఈ నెల 16 వరకూ గడువిచ్చారు.
Also read: ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ వెంటనే తిరిగి రాకపోతే ప్రమాదమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook