భారత్‌లో తొలి తరం క్రికెటర్లలో ఒకరైన వసంత్ రాయ్‌జీ (100) కన్నుమూశారు. ఫస్ల్ క్లాస్ క్రికెటర్లలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా రికార్డుకెక్కిన వసంత్ రాయ్‌జీ(Vasant Raiji Died) శనివారం తెల్లవారుజామున దక్షిణ ముంబైలోని వాకేశ్వర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నేటి మధ్యాహ్నం చందన్ వాడి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, ఈ ఏడాది జనవరిలో వసంత్ రాయ్‌జీ 100వ పుట్టినరోజు వేడుకలను దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, స్టీవ్ వా సెలబ్రేట్ చేయడం తెలిసిందే. IPL‌కు సిద్ధంగా ఉండాలి: సౌరవ్ గంగూలీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1941-42 సీజన్‌లో రంజీల్లో ముంబైకి ప్రాతినిథ్యం వహించిన వసంత్ రాయ్‌జీ (Vasant Raiji).. 1944-45 నుంచి 1949-50 వరకు బరోడా జట్టుకు సేవలందించారు. ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన వసంత్ రాయ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక రచయితగా మారారు. 1920 జనవరి 26న గుజరాత్ లోని బరోడాలో జన్మించారు. 2016లో మరో క్రికెటర్ బీకే గురుదచర్ మరణించిన తర్వాత అత్యంత వృద్ధ క్రికెటర్ అయ్యారు. కెరీర్‌లో 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన ఆయన 277 పరుగులు చేశారు. Porn Starగా మారిన టాప్ ప్లేయర్.. ఇప్పుడు లగ్జరీ లైఫ్



మహమ్మద్ నిస్సార్ బౌలింగ్ అంటే తనకు ఇష్టమన్న ఆయన ఫ్రాంక్ ఓరెల్ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేసేవాడినన్నారు. విజయ్ మర్చంట్, విజయ్ హజారే టెక్నిక్ బాగుండేదన్నారు. సంతోషంగా ఉండటమే తన ఆరోగ్య రహస్యమని, 100వ పుట్టినరోజును భార్య పన్నా (94) సమక్షంలో జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. క్రికెట్ అంటే పిచ్చి అని, ఇప్పటికి భారత్ ఆడే మ్యాచ్‌లు చూస్తాంటానని జనవరిలో బర్త్ డే సందర్భంగా వసంత్ రాయ్‌జీ వెల్లడించారు.(Oldest Cricketer Vasant Raiji)  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్