వెల్లింగ్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో తొలి 7 మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించిన భారత్‌కు న్యూజిలాండ్ గడ్డమీద పరాభవం తప్పలేదు. వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయిన టీమిండియా టెస్ట్ సిరీస్‌లో 2-0తో వైట్ వాష్‌కు గురైంది. తొలి టెస్టును నాలుగు రోజుల్లో ముగించిన ఆతిథ్య కివీస్, రెండో టెస్టును మూడు రోజుల్లోనే ముగించడం గమనార్హం. అయితే టెస్టు ఛాంపియన్ షిప్‌లో భారత్‌కు రెండు ఓటములు ఎదురుకాగా, ప్రత్యర్థి మాత్రం కివీస్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ రెండో టెస్టులో అదే జోరును ప్రదర్శిస్తూ 7 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో భారత్‌ను వైట్ వాష్ చేసింది. వన్డే సిరీస్‌ను 5-0తో కివీస్‌ను వైట్ వాష్ చేసిన విరాట్ కోహ్లీ సేన వన్డే సిరీస్‌లో 3-0తో ఆతిథ్య జట్టు చేతిలో వైట్ వాష్‌కు గురైన విషయం తెలిసిందే. తాజాగా టెస్ట్ సిరీస్‌ను 2-0తో వైట్ వాష్‌కు గురై కివీస్ టూర్‌ను దారుణంగా ముగించింది టీమిండియా.


Also Read: 17ఏళ్లుగా నిరీక్షణ.. భారత్‌పై కివీస్‌దే ఆధిపత్యం


భారత్‌పై కివీస్ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఐసీసీ మేజర్ ఈవెంట్లు వన్డే ప్రపంచ కప్, ట్వంటీ20 వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్‌లలో భారత్‌ను ఓడించిన తొలి, ఏకైక జట్టు కివీస్ కావడం గమనార్హం. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్ల కానిది పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ సాధిస్తాడని కోట్లాది భారతీయులు ఊహించారు. తొలి టెస్టుతో పాటు రెండో టెస్టులోనూ బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గానూ విఫలమై అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టాడు కోహ్లీ.


Also Read: టీమిండియా వైట్ వాష్‌కు 5 కారణాలు! 


భారత్‌కు అద్బుత విజయాలు అందించిన ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఐసీసీ మేజర్ ఈవెంట్లలో రెండు పర్యాయాలు (2007, 2016లలో) టీ20 వరల్డ్ కప్‌లలో విఫలమైంది. కాగా, తాజా ఓటమితో కోహ్లీ మూడు పర్యాయాలు కివీస్ చేతిలో వైఫల్యం చెందాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ కెప్టెన్సీలో ఐసీసీ ఈవెంట్ మ్యాచ్‌లో తొలిసారి భారత్ ఓడిపోగా, తాజాగా జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో రెండు టెస్టుల్లో ఓటమి చవిచూసింది. 


కాగా, 2003 వన్డే వరల్డ్ కప్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గడమే కివీస్‌ జట్టుపై భారత్‌కు ఓ ఐసీసీ ఈవెంట్‌లో చివరి విజయం. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనే భారత్ ఆ విజయాన్ని సాధించడం విశేషం. ఈ 17ఏళ్ల కాలంలో న్యూజిలాండ్ జట్టుపై ఐసీసీ ఈవెంట్ మ్యాచ్‌లో భారత్ గెలుపోటముల రికార్డు 0-5 దారుణంగా ఉంది.


See Pics: టాలీవుడ్ ఎంట్రీకి ముందే మోడల్ రచ్చ రచ్చ! 


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..