ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు భారత్‌కు రావాలనుకున్న వార్నర్‌కు బీసీసీఐ అనుమతి నిరాకరించింది. ఇటీవల కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకోవడంతో, అతడిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) 12 నెలల పాటు నిషేధం విధించింది. అదే సమయంలో ఈ ఏడాది ఐపీఎల్‌కు సైతం వార‍్నర్‌ దూరం కావాల్సి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. వార్నర్ కుటుంబసమేతంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లను చూడాలని ఆరాటపడ్డాడు. దీనికోసం బీసీసీఐకి అనుమతి కోరారట. అయితే బీసీసీఐ నుంచి అనుమతి రాలేదని వార్నర్‌ భార్య క్యాండైస్‌ పేర్కొంది, తన భర్త ఎంతో ఇష్టపడే జట్టుకు ప్రత్యక్షంగా మద్దతు తెలపడం కుదరడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది.


కొద్ది రోజుల క్రితం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ఆడే ఏదో ఒక మ్యాచ్‌‌ను చూసేందుకు తప్పకుండా భారత్‌ వస్తానని వార్నర్‌ చెప్పాడు. ఈ క్రమంలోనే అతని భార్య క్యాండైస్‌.. వార్నర్‌ భారత్‌కు వచ్చే అంశంపై బీసీసీఐ అనుమతి కోరగా.. గ్రీన్‌ సిగ‍్నల్‌ రాలేదట. ‘ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే మ్యాచ్‌లను చూసేందుకు వార్నర్‌ భారత్‌కు రావాలని ఆరాటపడ్డాడు. కానీ, బీసీసీఐ నుంచి అనుమతి లభించలేదు. వచ్చే ఏడాది అతను తప్పకుండా వస్తాడు. తను ఇష్టపడే జట్టును స్వయంగా కలిసి మద్దతిచ్చేందుకు కుదరడం లేదని వార్నర్‌ ఎంతో బాధపడుతున్నాడు’ అని వార్నర్‌ భార్య క్యాండైస్‌ పేర్కొంది.