సత్తా చాటిన ఢిల్లీ డేర్ డెవిల్స్.. కోల్‌కతాపై భారీ విజయం
ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో చెప్పుకోదగ్గ విజయాలేవీ నమోదు చేయని ఢిల్లీ డేర్ డెవిల్స్ పంట పండింది. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా సీజన్ మొత్తం గుర్తుపెట్టుకొనేలా సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో చెప్పుకోదగ్గ విజయాలేవీ నమోదు చేయని ఢిల్లీ డేర్ డెవిల్స్ పంట పండింది. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా సీజన్ మొత్తం గుర్తుపెట్టుకొనేలా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు బౌలర్లు కూడా ప్రత్యర్థులను హడలెత్తించడమే ఈ మ్యాచ్‌లో పనిగా పెట్టుకున్నారు. ఫలితంగా వారి ముందు కోల్‌కతా ఆటగాళ్లు తేలిపోయారు.
మ్యాచ్‌ని చేతుల్లో పెట్టి ఇచ్చారేమో అన్న ఫీలింగ్ తెప్పించారు. వివరాల్లోకి వెళితే తొలుత బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఢిల్లీ ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యార్ రెచ్చిపోయి ఆడాడు. 40 బంతుల్లో 93 పరుగులు చేసి తన విశ్వరూపాన్ని చూపాడు. కోల్‌కతా ఆటగాళ్లను బెంబేలెత్తించాడు. అతనికి పృథ్వీషా (44 బంతుల్లో 62 పరుగులు) కూడా తోడవ్వడంతో జట్టు భారీ స్కోరు వైపు పయనించింది. కొలిన్ మన్రో (33 పరుగులు), మ్యాక్స్‌వెల్ (27 పరుగులు) కూడా తమదైన శైలిలో జట్టుకి అండగా నిలవడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది
ఢిల్లీ ఇచ్చిన 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కోల్‌కతాని ఢిల్లీ బౌలర్లు బాగానే దెబ్బతీశారు. క్రిస్ లిన్, రాబిన్ ఉతప్ప, నరైన్, నితీశ్ రాణా లాంటి ఆటగాళ్లు చాలా తక్కువ స్కోరుకే ఔట్ అయిపోవడంతో జట్టు కష్టాల్లో పడిపోయింది.
యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ (37 పరుగులు), ఆండ్రీ రసెల్ (44 పరుగులు) కాస్త పోరాడడానికి ప్రయత్నించినా పరిస్థితి కంట్రోల్‌లోకి రాలేదు. నత్తనడకన సాగుతున్న మ్యాచ్‌లో వారిద్దరూ ఔట్ అవ్వడంతో కోల్‌కతాని ఓటమి వరించింది. ఢిల్లీ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, మ్యాక్స్‌వెల్, అవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా ఆ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు.