బెంగళూరు జట్టు జెర్సీ మారింది.. ఎందుకంటే..!
ఐపీఎల్11లో సీజన్ లో భాగంగా ఆదివారం బెంగళూరు వేదికగా, చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరిగింది.
బెంగళూరు: ఐపీఎల్11 సీజన్‌లో భాగంగా ఆదివారం బెంగళూరు వేదికగా, చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్‌సీబీ జట్టు ఆటగాళ్లంతా ఆకుపచ్చ రంగు జెర్సీ దుస్తులు ధరించారు. 'పర్యావరణాన్ని పరిరక్షిద్దాం' ఆనే నినాదంతో వీరు ఇలా గ్రౌండ్‌లోకి వచ్చారు.
గ్లోబల్ వార్మింగ్, పర్యావరణం రక్షణ బాధ్యతపై అవగాహన పెంచేలా ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఆర్‌సీబీ జట్టు ఆటగాళ్లు గో గ్రీన్ అంటూ.. ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా టాస్ వేసే ముందు ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్యా రహానెకు ఓ మొక్కను అందించాడు.
2011 నుంచి రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంచైజీ ప్రతి టోర్నీలోనూ ఏదో ఒక మ్యాచ్‌లో ‘గో గ్రీన్’ అంటూ ఆకుపచ్చ రంగు జెర్సీ ధరించి మ్యాచ్‌ను ఆడడం ఆనవాయితీగా వస్తోంది. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ గురించి అవగాహన కల్పించడమే దీని వెనుక ప్రధాన ఉద్దేశం.అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడటానికి మొక్కలు నాటడం, ఇంధన వనరులను కాపాడేందుకు బస్సుల్లోనే ప్రయాణించాలని సూచిస్తున్నారు.