స్వల్పమైన స్కోర్‌కే పెవిలియన్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2018లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. అయితే బ్యాటింగ్‌కి దిగిన కొద్దిసేపటికే శిఖర్ ధావన్ (0) వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్‌లో మొదటి బంతికి శిఖర్ ధావన్ క్లీన్ బౌల్డ్ అయి వికెట్ పోగొట్టుకున్నాడు. అనంతరం ఎంగిడి వేసిన 4వ ఓవర్‌లో 5వ బంతికి గోస్వామి(12) భారీ షాట్‌కు ప్రయత్నించి బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండానే ఠాకూర్ బౌలింగ్‌లో విలియమ్‌సన్(24) కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరి వికెట్ కోల్పోయి ఆరంభంలోనే కష్టాల్లో పడింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.
కష్టాల్లో పడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేసిన షకీబ్ కూడా బ్రావో బౌలింగ్‌లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మనీశ్ సైతం 8 పరుగులకే జడేజా బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చాడు. అనంతరం ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేసిన యూసుఫ్ పఠాన్ (24) కూడా బ్రావో బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వికెట్ కోల్పోయాడు.
స్వల్పమైన స్కోర్‌కే వికెట్ల మీద వికెట్లు పోగొట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్రాత్‌వైట్ 29 బంతుల్లో (1X4, 1X6) రాబట్టిన 43 పరుగులే జట్టు స్కోర్ పెరగడంలో కీలకం అయ్యాయి. అలా మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగుల స్వల్పమైన స్కోర్‌కే సన్ రైజర్స్ హైదరాబాద్ పెవిలియన్ చేరింది. ఇంత స్వల్పమైన స్కోర్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై గెలవాలి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగం ఇక తమ సత్తా చాటుకోవాల్సిందే. ఏం జరుగుతుందో తెలియాలంటే, మ్యాచ్ ఫలితం తేలే వరకు వేచిచూడాల్సిందే.