ఐపీఎల్ 2018లో భాగంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్  హోల్క‌ర్ క్రికెట్ స్టేడియంలో సోమవారం కింగ్స్ లెవెన్ పంజాబ్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన బెంగ‌ళూరు జ‌ట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించింది. కాగా, పంజాబ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే ఆలౌట్ అయింది. అయితే, 15.1 ఓవ‌ర్ల‌కు 88 ప‌రుగులు చేసిన పంజాబ్.. బెంగ‌ళూరు ముందు 89 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని ఉంచింది. దీంతో 89 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగ‌ళూరు  నిర్ణీత 8.1 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 92 పరుగులు చేసింది. దీంతో ప‌ది వికెట్ల తేడాతో పంజాబ్‌పై బెంగ‌ళూరు విజ‌యం సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు కోల్‌కతా vs రాజస్థాన్


ఐపీఎల్‌లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్- రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకై అత్యంత కీలకం. ఇరు జట్లు ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లు ఆడి 6 చొప్పున విజయాలతో పాయింట్ల పట్టికలో మూడు నాలుగు స్థానాలలో ఉన్నాయి.