మేం 20 రన్స్ చేసి ఉంటే బాగుండేది
క్వాలిఫయర్ 1లో చేతులారా చెన్నై చేతిలో ఓడటంపై హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు.
క్వాలిఫయర్ 1లో చేతులారా చెన్నై చేతిలో ఓడటంపై హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం విలియమ్సన్ మాట్లాడుతూ, 'మేం సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాం. తొలి బంతికే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయాం. అక్కడి నుంచే వికెట్ల పతనం మొదలైంది. బ్రాత్‌వైట్ బ్యాటింగ్‌లో రాణించాడు. అతని ఇన్నింగ్స్ కాస్త ఊరటనిచ్చింది. బౌలర్లు అద్భుతంగా రాణించారు. మరో 20 పరుగులు చేసి ఉంటే మంగళవారం మ్యాచ్‌లో గెలిచేవాళ్ళం' అన్నారు.
డుప్లేసిస్ మెరుగైన ఆట తీరువల్లే చెన్నైకి విజయం దక్కిందన్న విలియమ్సన్.. ఈ మ్యాచ్‌లో చెన్నై లోయర్ ఆర్డర్‌ను చూసి మేము కొంత నేర్చుకుని తుదపరి మ్యాచ్‌లో అలా ఆడేలా ప్రయత్నిస్తామని, చివరి అవకాశంలో రాణిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్1లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో చెన్నై ఐపీఎల్ ఫైనల్లో చోటు సంపాదించింది.
కాగా మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన సన్‌రైజర్స్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుపై గెలిస్తే సన్‌రైజర్స్ ఫైనల్లో అడుగుపెట్టవచ్చు. రాజస్థాన్ రాయల్స్ - కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.