భారత జట్టులోకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) ఎంట్రీ ఇస్తాడని గత మూడేళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటిది జరగలేదు. కీలక సమయాల్లో నిరూపించుకోకపోవడంతో అర్జున్‌కు టీమిండియాకు నెట్స్‌లో బౌలింగ్ చేసే ఛాన్స్ వచ్చింది కానీ జాతీయ జట్టులో అవకాశం దక్కలేదు. ప్రస్తుతం అర్జున్‌కు సంబంధించిన ఓ విషయం హాట్ టాపిక్ అవుతోంది. CSK In IPL 2020: సీఎస్కేను వీడని కరోనా కష్టాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తరఫున క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడట. బీసీసీఐ నిబంధనల ప్రకారం క్వారంటైన్ పూర్తి చేసుకున్న అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్జున్ ముంబై ఆటగాళ్లతో దుబాయ్‌లో సరదాగా గడుపుతున్నాడు. ముంబై ఫాస్ట్ బౌలర్లతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో అర్జున్ టెండూల్కర్ దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఐపీఎల్‌లో అర్జున్‌ను బరిలోకి దించి.. ఇక్కడ రాణిస్తే, ఆపై టీమిండియాలోకి అవకాశం దక్కుతుందని సచిన్ భావిస్తున్నట్లుగా సమాచారం. IPL 2020: జట్టుతో చేరిన అరుదైన క్రికెటర్



ముంబై జట్టుకు సచిన్ మాట వేద వాక్కు లాంటిది. సచిన్ ఒక్కమాట చెబితే చాలు అర్జున్ టెండూల్కర్‌ను జట్టులోకి తీసుకుంటారు. బౌలింగ్, బ్యాటింగ్ చేయగల ఆల్ రౌండర్ కావడంతో కనీసం యూఏఈ వేదికగానైనా అర్జున్‌ను ఐపీఎల్ బరిలోకి దింపితే అతడి కెరీర్‌కు ప్రయోజనం ఉంటుందని సచిన్ అభిమానులు భావిస్తున్నారు. ఈ మేరకు పోస్టులు చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ దీనిపై ఏ అధికారిక ప్రకటన చేయలేదు. Trent Boult breaks a stump: ఐపీఎల్ ప్రాక్టీస్‌లో వికెట్లు విరుగుతున్నాయి.. 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR