Trent Boult breaks a stump: ఐపీఎల్ ప్రాక్టీస్‌లో వికెట్లు విరుగుతున్నాయి..

Trent Boult Practice Video | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు సైతం కఠోర సాధన చేస్తున్నారు. ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) ఐపీఎల్ 2020కి బాగానే సన్నద్దమయ్యాడని తెలుస్తోంది.

Last Updated : Sep 13, 2020, 09:32 AM IST
Trent Boult breaks a stump: ఐపీఎల్ ప్రాక్టీస్‌లో వికెట్లు విరుగుతున్నాయి..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు సైతం కఠోర సాధన చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) ఐపీఎల్ 2020కి బాగానే సన్నద్దమయ్యాడని తెలుస్తోంది. ఈ మేరకు ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. NEET 2020 Exam: నేడే నీట్.. విద్యార్థులు ఇవి పాటించాలి

ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians)కు ప్రాతినిథ్యం వహిస్తోన్న బౌల్ట్ ప్రాక్టీస్ సెషన్‌లో వికెట్లు విరగ్గొడుతున్నాడు. తన పదునైన లెంగ్త్ డెలివరీలు, యార్కర్లతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో బౌల్ట్ సంధించిన ఓ సూపర్ డెలివరీ ఏకంగా మిడిల్ స్టంప్ వికెట్‌ను విడగొట్టింది. ముంబై ఇండియన్స్ ఈ వీడియో పోస్ట్ చేసింది.  Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి

లైన్ అండ్ లెంగ్త్, వికెట్ టు వికెట్ బౌలింగ్ ఎంత ప్రాక్టీస్ చేశాడో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. సెప్టెంబర్ 19న ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో అబుదాబి వేదికగా తలపడనుంది.   Remedies for Piles: పైల్స్ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News