తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైన ముంబై ఇండియన్స్ రెండో మ్యాచ్‌లో విజయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో బోణి కొట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)పై ఏకంగా 49 పరుగుల భారీ విజయాన్ని రోహిత్ శర్మ సేన అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన కేకేఆర్ ఆటగాడు, ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ దారుణంగా విఫలమయ్యాడు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ.15.5 కోట్లతో కేకేఆర్ పాట్ కమిన్స్‌ను కొనుగోలు చేసింది. అయితే కాస్ట్‌లీ బౌలర్ 3 ఓవర్లలో 49 పరుగులు ధారాళంగా ఇచ్చేశాడు. కనీసం వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో పాట్ కమిన్స్‌పై, అతడిని భారీ ధరకు తీసుకున్న కేకేఆర్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు, విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే తమ ఆటగాడు కమిన్స్‌కు కేకేఆర్ కెప్టెన్ దినేష్ కార్తీక్ మద్దతుగా నిలిచాడు. 



‘కేవలం ఒక్క మ్యాచ్ ప్రదర్శనతో ఆటగాడి గురించి వ్యాఖ్యలు చేయడం, ఓ అభిప్రాయానికి రావడం మంచిది కాదు. క్వారంటైన్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాడు పాట్ కమిన్స్. చివరి నిమిషంలో అతడు మైదానంలోకి అడుగుపెట్టాడు. అతడిపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. కమిన్స్ వరల్డ్ క్లాస్ ప్లేయర్. తర్వాతి మ్యాచ్‌లలో కమిన్స్ కచ్చితంగా రాణిస్తాడని’ కేకేఆర్ కెప్టెన్ దినేష్ కార్తీక్ మ్యాచ్ అనంతరం ఈ విధంగా స్పందించాడు. 



కాగా, బ్యాటింగ్‌లో పాట్ కమిన్స్ సత్తా చాటాడు. కేవలం 12 బంతుల్లోనే 275 స్ట్రైక్ రేట్‌తో 33 పరుగులు చేశాడు. ముంబై స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాను ఓ ఓవర్‌లో ఆడుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టడం అరుదుగా చూస్తుంటాం కానీ, నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ బుమ్రా వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా 4 సిక్సర్లు బాదడం గమనార్హం. తర్వాతి మ్యాచ్‌లలో తాను బ్యాట్‌తో సైతం ప్రమాదకారినని సంకేతాలు పంపాడు పాట్ కమిన్స్.   


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe