ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) తాజా సీజన్ రద్దు దిశగా సాగుతోంది. ఐపీఎల్ నిర్వహణలో అన్ని దారులు మూసుకుపోయినట్టుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్‌ను ఏప్రిల్ 15కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా దేశంలో మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధించడం, కోవిడ్19 మరణాలు, పాజిటీవ్ కేసులు పెరిగిపోతుండటం ప్రతికూలాంశంగా మారింది.   కరోనా ఎఫెక్ట్: వాట్సాప్ వినియోగదారులకు షాక్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విదేశీ క్రికెటర్లు కీలకం 
ఐపీఎల్ నిర్వహించాలంటే విదేశీ క్రికెటర్లు కూడా రావాలి, ఆడాలి. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీ క్రికెటర్ల వీసాలకు అనుమతిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు లాక్‌డౌన్ ఎంతకాలం కొనసాగుతుంది, కరోనా వైరస్ సమస్య ఎప్పుడు అదుపులోకి వస్తుందో చెప్పలేని తరుణంలో ఐపీఎల్ 2020 నిర్వహణపై బీసీసీఐ పెద్దలు ఆశలు వదిలేసుకున్నారని బోర్డు విశ్వసనీయ వర్గాల సమాచారం.


సోషల్ డిస్టాన్సింగ్ సమస్య
కరోనా లాంటి మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రస్తుతం ఉన్న దారి సోషల్ డిస్టాన్సింగ్ మాత్రమే. విదేశీ క్రికెటర్లు లేకుండా ఐపీఎల్ అంటే ఫ్రాంఛైజీలు, మేనేజ్‌మెంట్లు అంగీకరించే పరిస్థితి లేదు. ఒకవేళ విదేశీ క్రికెటర్లు వచ్చినా సోషల్ డిస్టాన్సింగ్ కారణంగా మ్యాచ్‌ల నిర్వహణ కష్టసాధ్యమేనని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.  కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్


బ్రతికుంటే ఏ ఆటలైనా ఆడుకోవచ్చునని సైతం కొందరు క్రికెట్ మాజీలు తమ మనసులోని మాటను చెబుతున్నారు. ఇన్ని క్లిష్టపరిస్థితుల నేపథ్యంలో కేంద్రంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బోర్డు సభ్యులు చర్చలు జరిపిన అనంతరం ఐపీఎల్ రద్దుపై ప్రకటన రానుందని ప్రచారం జరుగుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos 


బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone