CSK vs RR: MS Dhoni: అంపైర్లతో మళ్లీ వాగ్వివాదానికి దిగిన ఎంఎస్ ధోనీ.. అసలేం జరిగింది?
MS Dhoni loses cool again | మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరున్న ఎంఎస్ ధోనీ కేవలం రెండో మ్యాచ్‌లోనే సహనం కోల్పోయి అంపైర్లతో వాగ్వివాదానికి దిగేసరికి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.
చాలా కాలం తర్వాత ఎంఎస్ ధోనీ (MS Dhoni) మైదానంలో కనిపించేసరికి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులతో పాటు ధోనీ ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరున్న ఎంఎస్ ధోనీ కేవలం రెండో మ్యాచ్‌లోనే సహనం కోల్పోయి అంపైర్లతో వాగ్వివాదానికి దిగేసరికి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) లో భాగంగా షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించడం తెలిసిందే.
అయితే టాస్ ఓడిన రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు దిశగా రాజస్థాన్ సాగుతోంది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో టామ్ కర్రాన్ ఆడిన బంతిని కీపర్ ధోనీ క్యాచ్ పట్టాడు. అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. అయితే అప్పటికే రివ్యూలు పూర్తిచేసుకున్నా పొరపాటున రివ్యూ కోరాడు టామ్ కర్రాన్. అయినా క్రీజు వదిలి పెవిలియన్‌కు వెళ్తున్న కర్రాన్‌ను అంపైర్లు ఆపారు. లెగ్ అంపైర్ అనుమానంతో అంపైర్‌తో చర్చించి టెక్నికల్ రివ్యూకు వెళ్లారు. బంతి మైదానాన్ని తాకిన తర్వాత ధోనీ క్యాచ్ అందుకున్నట్లు తేలడంతో కర్రాన్‌ను నాటౌట్‌గా ప్రకటించారు.
కాగా, అప్పటికే రాజస్థాన్ భారీ స్కోరు దిశగా సాగడం, ఔటై వెళ్లిపోతున్న టామ్ కర్రాన్‌ను ఆపడం ప్రత్యర్థి చెన్నై జట్టు కెప్టెన్ ధోనీని అసహనానికి గురిచేసింది. దీంతో అంపైర్లతో వాదనకు దిగుతూ సలహాలు సైతం ఇచ్చాడు. అయితే రివ్యూలు అయిపోయినా ఎలా అనుమతించారని సందేహం, లేక ఓటిచ్చిన తర్వాత నిర్ణయాలు మార్చడం లాంటి అంశాలపై అంపైర్ల విషయంలో ధోనీ విసుక్కున్నట్లు కనిపించాడు. రాజస్థాన్‌తో ఇలా జరగడం ఇది రెండోసారి.
రాజస్థాన్‌తో మ్యాచ్‌లో గత సీజన్‌లోనూ ధోనీ తన సహనాన్ని కోల్పోయాడు. చివరి ఓవర్‌లో ముందు నోబాల్ ఇచ్చి తర్వాత లెగ్ అంపైర్ తో చర్చించాక, బంతిని పరిగణనలోకి తీసుకోవడంతో ధోనీ అంపైర్లతో వాగ్వివానికి దిగాడు. బెన్ స్టోక్స్ సర్ది చెప్పాలని చూసినా ధోనీ వినిపించుకోలేదు. అంపైర్ల నిర్ణయంపై నియంత్రణ కోల్పోయి వాగ్వివాదానికి వెళ్లడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా అదే రిపీట్ అయింది.
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe