RR vs CSK match Highlights: ధోనీ సేనపై గెలిచిన Rajasthan Royals.. గెలిపించింది ఎవరు ? ఓడించింది ఎవరు ?

ఐపీఎల్‌ 2020లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌ ( Rajasthan Royals ), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై రాజస్థాన్ 16 పరుగుల తేడాతో గెలిచి తన సత్తా చాటుకుంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్‌కి దిగింది.

Last Updated : Sep 23, 2020, 12:31 AM IST
  • ఐపిఎల్ 2020 టోర్నమెంట్‌లో శుభారంభం చేసిన రాజస్థాన్ రాయల్స్.
  • ఐపిఎల్ 2020 లో తొలి మ్యాచ్‌తోనే ఓ రికార్డు సొంతం చేసుకోవడంతో పాటు ఘన విజయం కైవసం.
  • ధోనీ సేనపై గెలిచి క్రికెట్ ప్రియుల దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు
RR vs CSK match Highlights: ధోనీ సేనపై గెలిచిన Rajasthan Royals.. గెలిపించింది ఎవరు ? ఓడించింది ఎవరు ?

ఐపీఎల్‌ 2020లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై రాజస్థాన్ 16 పరుగుల తేడాతో గెలిచి తన సత్తా చాటుకుంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (  Chennai Super Kings ) జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్‌కి దిగింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున సంజు శాంసన్, స్టివ్ స్మిత్, జోఫ్రా ఆర్చర్ లాంటి ఆటగాళ్లు చెలరేగిపోవడంతో Rajasthan Royals జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. 

వికెట్ కీపర్ సంజు శాంసన్ ( Sanju Samson ) 32 బంతుల్లో 74 పరుగులు ( 6X9, 4X1) చేసి తన సత్తా చాటుకోగా.. మరోవైపు స్కిప్పర్ స్టీవ్ స్మిత్ ( Steve Smith ) 47 బంతుల్లో 69 పరుగులు ( 6x4, 4x4) చేసి స్కోర్‌ని 200 వైపు నడిపించాడు. 19 ఓవర్ చివర్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కోర్ 186/7 వద్ద ఉండగా.. సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి ( Lungi Ngidi ) వేసిన చివరి ఓవర్లో ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ ( Jofra Archer ) చెలరేగిపోయాడు. Lungi Ngidi వేసిన చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ ఏకంగా 4 సిక్సులు కొట్టాడు. అందులో 2 నో బాల్స్ ( No balls ) కూడా ఉన్నాయి. అలా చివరి ఓవర్లో మరో 30 పరుగులు జోడించడంతో రాజస్థాన్ రాయల్స్ 216 పరుగులు చేయగలిగింది. Also read IPL 2020లో ఆ ఫస్ట్ రికార్డు Rajasthan Royals సొంతం

అనంతరం 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( CSK ) ఏ దశలోనూ రాజస్థాన్ రాయల్స్ జట్టుకి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒక్క డు ప్లెసిస్ ( Du plessis ) తప్ప ఎవరూ రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి తట్టుకుని నిలబడలేకపోయారు. డు ప్లెసిస్ 37 బంతుల్లో 72 పరుగులు ( 6X7, 4X1) చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు కానీ అతడి శ్రమ ఫలించలేదు. చివర్లో ధోనీ ( MS Dhoni ) సైతం మూడు సిక్స్‌ల బాదడంతో ఓటమి భారం ఇంకొంత తగ్గిందని అనుకోవచ్చు. 

రాజస్ధాన్ బౌలర్ రాహుల్ తేవాటియా ( rahul tewatia ) మూడు కీలక వికెట్లు తీసి Chennai Super Kings‌ నడ్డి విరిచాడు. ఇక సీఎస్‌కే బౌలర్లలో సామ్‌ కరాన్‌ మూడు వికెట్లు తీయగా, ఎన్‌గిడి, చావ్లా, దీపక్‌ చాహర్‌లు ఒక్కో వికెట్‌ తీశారు. లుంగి ఎంగిడి చివరి ఓవర్లో సమర్పించుకున్న 30 పరుగులు చెన్నై సూపర్ కింగ్స్‌ ఎదుట భారీ విజయ లక్ష్యానికి కారణమయ్యాయి. లేదంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండి ఉండేదేమో అంటున్నారు ధోనీ అభిమానులు. Also read : RR vs CSK match 4 preview: రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ప్రివ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News