IPL 2020: హైదరాబాద్‌ను ఓడించి తొలిసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఐపీఎల్ 13వ సీజన్‌లో టైటిల్ బరిలో నిలిచింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో.. హైదరాబాద్ సన్ రైజర్స్ (Sunrisers Hyderabad ) ను ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో ఓడించింది.
Delhi Capitals beat Sunrisers Hyderabad by 17 runs: అబుదాబి: ఐపీఎల్ (IPL) చరిత్రలో ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఐపీఎల్ 13వ సీజన్‌లో టైటిల్ బరిలో నిలిచింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో.. హైదరాబాద్ సన్ రైజర్స్ (Sunrisers Hyderabad ) ను ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో శ్రేయాస్ అయ్యర్ సేన మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లో నాలుగుసార్లు టైటిల్ నెగ్గిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో తలపడేందుకు సిద్ధమైంది. DC vs MI Match IPL 2020: ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండోసారి.. ఢిల్లీ చెత్త రికార్డు!
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (50 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. హెట్‌మైర్ (22 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), స్టొయినిస్ (38; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అద్భుతంగా రాణించి స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. అనంతరం లక్ష్యఛేదనలోకి దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసింది. విలియమ్సన్ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా ఆటగాళ్లందరూ గెలవాల్సిన మ్యాచ్‌లో రాణించలేకపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రబాడ 4 వికెట్లు తీయగా.. ఇటు బ్యాటింగ్‌లో రాణించడంతోపాటు బౌలింగ్ వేసి 3 వికెట్లు పడగొట్టిన స్టొయినిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' వరించింది. IPL 2020 Final: ఎంఎస్ ధోనీ ఉంటే రోహిత్‌దే విజయం.. కానీ ఈ ఫైనల్ సంగతేంటి!
లక్ష్యఛేదనలో హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. రబాడ వేసిన రెండో ఓవర్‌లో కెప్టెన్ వార్నర్ (2) ఔట్ కాగా.. స్టొయినిస్ వేసిన ఐదో ఓవర్‌లో ప్రియమ్ గార్గ్ (17; 2 సిక్సర్లు), మనీశ్ పాండే (21; 3 ఫోర్లు) ఔట్ అయ్యారు. ఈ క్రమంలో క్రిజులోకి వచ్చి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్న విలియమ్సన్‌కు హోల్డర్ (11) కొంతసేపు సహకరించాడు. హోల్డర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అబ్దుల్ సమద్ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారంతో కేన్ స్కోరును కదిలించినప్పటికీ.. విజయానికి 43 పరుగులు అవసరమైన దశలో విలియమ్సన్ ఔటయ్యాడు. ఆ తర్వాత ఆశలురేపిన సమద్, రషీద్ ఖాన్ కూడా పెవిలియన్ బాటపట్టారు. ఆతర్వాత వచ్చిన శ్రీవత్స్ గోస్వామి (0) కూడా అవుట్ కావడంతో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి ఓడిపోయింది.
ఇదిలాఉంటే.. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టు ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. గతంలో ఆ జట్టు నాలుగుసార్లు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించి ఫైనల్స్‌కు వెళ్లలేకపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్ కూడా హైదరాబాద్ జట్టుకు భారీ దెబ్బ కొట్టింది. బౌలింగ్‌తో కట్టడి చేయలేకపోయినప్పటికీ హైదరాబాద్ ఆటగాళ్లు అందుకోవాల్సిన క్యాచ్‌లను వదిలేసి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe