ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో భాగంగా ఐపీఎల్‌లో 200 సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అబుదాబి వేధికగా జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి జట్టును విజయపథంలో నడిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సైతం అందుకున్నాడు హిట్ మ్యాన్. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు యూనివర్సల్ బాస్, విండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) పేరిట ఉంది. 326 సిక్సర్లతో ఐపీఎల్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు గేల్. ఏబీ డివిలియర్స్ 214, ఎంఎస్ ధోనీ 212 సిక్సర్లతో రోహిత్ కన్నా ముందున్నారు. సురేష్ రైనా (194) సైతం టాప్ 5లో ఉన్నాడు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 190 సిక్సర్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. మరికొన్ని రోజుల్లో కోహ్లీ సైతం ఈ అరుదైన జాబితాలో చేరనున్నాడు. 




కాగా, ఈ కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్ 194 సిక్సర్లతో ఉన్నాడు, సరిగ్గా ఈ మ్యాచ్‌లో 6 సిక్సర్లు బాది ఐపీఎల్‌లో 200 సిక్సర్లు కొట్టిన నాలుగో క్రికెటర్‌గా అరుదైన జాబితాలో నిలిచాడు. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్‌లు సంయుక్తంగా 181 సిక్సర్లతో 7వ స్థానంలో కొనసాగుతున్నారు. 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe