ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో తమ తొలి మ్యాచ్‌లో పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) గెలుపొందింది. అయితే 32 బంతుల్లోనే 9 సిక్సర్లు బాది 74 పరుగులు చేసిన రాజస్థాన్ యువ సంచలనం సంజూ శాంసన్ (Sanju Samson)‌పై ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసల జల్లులు కురిపించాడు. దాంతోపాటు ఓ విషయంపై తన ఆశ్చర్యాన్ని వెల్లడించాడు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shane Warne About Sanju Samson | ‘సంజూ శాంసన్ అద్భుత ఆటగాడు. నేను చూసిన బెస్ట్ ప్లేయర్లలో శాంసన్ ఒకడని చెప్పవచ్చు. కానీ ఇలాంటి ఆటగాడికి టీమిండియాలో చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. సంజూ శాంసన్ ఓ ఛాంపియన్. అతడికి భారత క్రికెట్ జట్టులో ఏ ఫార్మాట్‌లోనూ చోటివ్వకపోవడం నిజంగానే ఆశ్చర్యం కలిగించే అంశంమే.



ఈ ఏడాది సంజూ శాంసన్ ఇలాగే అత్యుత్తమ ప్రదర్శనలు చేయాలని ఆశిస్తున్నాను. అదే విధంగా రాజస్థాన్ ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో శాంసన్ తనవంతు పాత్ర పోషిస్తాడని భావిస్తున్నాను. అతడికి భారత జట్టులో చోటు దక్కాలని’ రాజస్థాన్ రాయల్స్ మాజీ మెంటార్ షేన్ వార్న్ పేర్కొన్నాడు. 



ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe