సన్ రైజర్స్ హైదరాబాద్ IPL 2020 షెడ్యూల్.. SRH తొలి మ్యాచ్ ఎవరితో!
ప్రతిసారి అంచనాలు లేకుండా బరిలోకి దిగి సంచలనాలు చేసే జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటి. సన్ రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది.
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మార్చి 29న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI), మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగే మ్యాచ్‌తో సీజన్ 13 ప్రారంభం కానుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ 2020 షెడ్యూలు వచ్చేసింది. సన్ రైజర్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.
Also Read: ఆర్సీబీ ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూలు
ఏప్రిల్ 1న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్డేడియంలో రాత్రి 8 గంటలకు ముంబై, సన్ రైజర్స్ మ్యాచ్ జరగనుంది. తమ రెండో మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనుంది. ఏప్రిల్ 4న మొహాలీ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. లీగ్‌లో ఒక్కో జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. లీగ్ దశలో సన్ రైజర్స్ తమ చివరి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మే 15న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనుంది.
Also Read: ఐపీఎల్ ఫైనల్‌ను తలపించే తొలి పోరు!
[[{"fid":"182107","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"sunrisers hyderabad IPL 2020 schedule","field_file_image_title_text[und][0][value]":"సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 షెడ్యూల్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"sunrisers hyderabad IPL 2020 schedule","field_file_image_title_text[und][0][value]":"సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 షెడ్యూల్"}},"link_text":false,"attributes":{"alt":"sunrisers hyderabad IPL 2020 schedule","title":"సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 షెడ్యూల్","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]
ఐపీఎల్ తాజా సీజన్‌లో రెండు మ్యాచ్‌ల నిర్వహణను కేవలం ఆదివారానికే పరిమితం చేశారు. గత 12 సీజన్లలో శని, ఆదివారాల్లో మాత్రమే రెండు మ్యాచ్‌లు నిర్వహించారు. ఐపీఎల్ 2020లో కేవలం ఆదివారం రెండు మ్యాచ్‌లు నిర్వహించాలని ప్లాన్ చేయడంతో ఈ సీజన్ మరికొన్ని రోజులు అభిమానులకు కనువిందు చేయనుంది.
Also Read: ఐపీఎల్ స్పెషల్ క్రికెటర్‌కు బీసీసీఐ షాక్!