న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) కారణంగా ఈ ఏడాది జరగనున్న ఐపిఎల్ 2020 ( IPL 2020 ) టోర్నమెంట్‌లో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని చెన్నై సూపర్​ కింగ్స్ ( CSK team 2020 ) స్టార్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. కొవిడ్-19 మార్గదర్శకాలు, నిబంధనలు పాటిస్తూ ఆట కొనసాగించడం ఒక పెద్ద సవాల్ అయితే.. లాక్​డౌన్ కారణంగా 4 నెలల పాటు ఇంటికే పరిమితమైన ఆటగాళ్లకు ఫిట్​నెస్ మరో పెను సవాలుగా మారనుందని రైనా పేర్కొన్నాడు. క్రికెట్ ప్రియులకు ఐపిల్ 2020 ఆహ్లాదాన్నే పంచనున్నప్పటికీ.. ఆటగాళ్లకు మాత్రం కొవిడ్-19 తిప్పలు తప్పేలా లేవని రైనా స్పష్టంచేశాడు. Also read: #Watch Suresh Raina: ధోనీ తర్వాత మళ్లీ తనే.. రోహిత్ శర్మపై రైనా ప్రశంసలు


యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు జరుగనున్న ఐపిఎల్ 2020లో ఎదురు కానున్న సవాళ్ల గురించి మాట్లాడుతూ రైనా ( Suresh Raina ) ఈ వ్యాఖ్యలు చేశాడు. Also read: ENG vs PAK: ఈసారైనా పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ కల నెరవేరేనా ?