IPL 2021 Latest News: ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక పలికిన భారత డొమెస్టిక్ ఆటగాళ్లలో కృష్ణప్ప గౌతమ్ ఒకడని చెప్పవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈ టాలెంటెడ్ ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేసింది. అయితే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎస్కే ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ పలు ఆసక్తికర విశేషాలు షేర్ చేసుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంఎస్ ధోనీ లాంటి ఆటగాడి కెప్టెన్సీలో ఆడాలని ప్రతి బౌలర్ కలలు కంటాడని వ్యాఖ్యానించాడు. బౌలర్ల బలమేంటో మహీ భాయ్‌కి బాగా తెలుసు. బౌలర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను తీసుకురావడం ధోనికి తెలుసునని గౌతమ్ చెప్పినట్లు సీఎస్కే వెబ్‌సైట్‌లో కథనం పబ్లిష్ చేశారు. ధోనీ(MS Dhoni) కెప్టెన్సీలో ఆడాలనుకున్న తన కల నెరవేరనుందని, అందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. సీఎస్కే లాంటి జట్టులో ఒకడిగా ఆడబోతున్నందుకు తనపై ఏ ఒత్తిడి లేదన్నాడు.


Also Read: Irfan Pathan: మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌కు కరోనా పాజిటివ్, సచిన్‌తో మొదలైంది


రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆల్ రౌండర్ గౌతమ్ క్రిష్ణప్ప ఆపై పంజాబ్ కింగ్స్ తరఫున సైతం మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ జట్లలో సీఎస్కే చాలా ప్రత్యేకమైన జట్టు అని, వారి ఆలోచనా విధానంతో ఇతరులకు భిన్నమైన టీమ్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు. అవసరమైన సమయంలో ఆటగాళ్లలో సీఎస్కే(Chennai Super Kings) మేనేజ్‌మెంట్ ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని, బలమైన నాయకుడు సైతం ఉన్నాడని, అదే జట్టు విజయానికి కారణమని పేర్కొన్నాడు. 


చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ప్రస్తుతం ముంబైలో శిక్షణ పొందుతున్నారు. ముంబై వేదికగానే సీఎస్కే జట్టు తమ తొలి 5 మ్యాచ్‌లు ఆడనుంది. ఏప్రిల్ 10వ తేదీన గత ఏడాది రన్నరప్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ తొలి మ్యాచ్‌లో సీఎస్కే తలపడనుంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకున్నాడు. చతేశ్వర్ పుజారా, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప వంటి సీనియర్ క్రికెటర్లు ముంబైలోని సీఎస్కే శిక్షణ శిబిరానికి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 


Also Read: IND vs ENG 3rd ODI Highlights: టీమిండియా కెప్టెన్ Virat Kohli స్టన్నింగ్ క్యాచ్, Viral Video 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook