IPL 2021: సీఎస్కే కెప్టెన్ MS Dhoni ఖాతాలో అరుదైన రికార్డు, లీగ్ చరిత్రలో తొలిసారిగా
MS Dhoni In IPL: వయసు మీద పడిందని రిటైర్ కావాలని, బ్యాట్ ఝులిపించడం లేదని సైతం ధోనీపై ఎన్నో విమర్శలు గత ఏడాది నుంచి వెల్లువెత్తుతున్నాయి. అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు నమోదైంది.
IPL 2021 Latest Updates| ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రతి సీజన్లోనూ టైటిల్ ఫెవరేటే. అందుకు కారణం సీఎస్కే కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. వయసు మీద పడిందని రిటైర్ కావాలని, బ్యాట్ ఝులిపించడం లేదని సైతం ధోనీపై ఎన్నో విమర్శలు గత ఏడాది నుంచి వెల్లువెత్తుతున్నాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు నమోదైంది.
ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేసిన తన తొలి మ్యాచ్‌లో చెన్నై జట్టుకు విజయాన్ని అందించిన ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా తన 200వ మ్యాచ్‌లోనూ సీఎస్కేను విజయాన్ని అందించాడు. ఐపీఎల్ 2021(IPL 2021)లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో 150 మంది ఔట్లలో పాలు పంచుకున్నాడు. కేకేఆర్ ఆటగాడు నితీష్ రాణా ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో ఐపీఎల్ చరిత్రలో 150 వికెట్లలో పాలు భాగస్వామి అయిన తొలి వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ నిలిచాడు. అందులో 111 క్యాచ్‌లు పట్టగా, 39 మంది బ్యాట్స్‌మెన్‌ను స్టంపౌట్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు.
Also Read: హ్యాట్రిక్ ఓటమి తర్వాత PBKS పై గెలిచి IPL 2021లో ఖాతా తెరిచిన SRH
ఓ దశలో దినేష్ కార్తీక్ ఎంఎస్ ధోనీని అధిగమించాడు. కానీ ఎట్టకేలకు తన వికెట్ కీపింగ్ ప్రతిభ, నైపుణ్యంతో ఐపీఎల్ చరిత్రలో 150 వికెట్లలో భాగస్వామి అయిన తొలి వికెట్ కీపర్‌గా ధోనీ(MS Dhoni) నిలిచాడు. ధోనీ తరువాత స్థానంలో దినేష్ కార్తీక్ ఉన్నాడు. కేకేఆర్ వికెట్ కీపర్ ఇప్పటివరకూ 112 క్యాచ్‌లు అందుకోగా, 31 స్టంపౌట్లు చేశాడు. గత సీజన్లో కేకేఆర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో, ఇయాన్ మోర్గాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గానూ కార్తీక్ రాణిస్తున్నాడు.
Also Read: IPL 2021: KKR కెప్టెన్ Eoin Morganకు రూ.12 లక్షల భారీ జరిమానా, తప్పిదం ఏమంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook