దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ సేవ్‌లో భారీగా కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు వారం రోజుల వ్యవధిలో రెట్టింపు నిర్ధారితమవుతున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బుధవారం ఉదయం చెడు వార్త వినాల్సి వచ్చింది. ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తల్లి దేవికా రాణి, తండ్రి పాన్ సింగ్‌లకు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ధోనీ తల్లిదండ్రులు కోవిడ్19 నిర్ధారణ టెస్టులు చేయించుకున్నారు. ఈ క్రమంలో వెలువడిన ఫలితాలలో వారికి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం వారిని చికిత్స నిమిత్తం స్వస్థలం జార్ఖండ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాంచీలోని పల్స్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో దేవికా రాణి, పాన్ సింగ్‌లకు కరోనా చికిత్స అందిస్తున్నారు. వారి ఆక్సిజన్ స్థాయిలు స్థిరంగా ఉన్నాయని, కోవిడ్19 పాజిటివ్‌గా తేలిన వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారని హాస్పిటల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read; Mumbai Indians కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా, కారణమేంటో తెలుసా
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2021 మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాడు. ముంబైలో బయో బబుల్ వాతావరణంలో ధోనీ సురక్షితంగా ఉన్నాడు. ఆటగాళ్లు బయటకు రావడం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ ఎవరైనా ఆటగాడు బయోబబుల్ నుంచి బయటకు వెళితే, తిరిగొచ్చిన తరువాత క్వారంటైన్ పూర్తి చేసుకుని కరోనా టెస్టులకు వెళ్లాల్సి ఉంటుంది. కరోనా నెగెటివ్ వస్తేనే జట్టు ఆటగాళ్లతో చేరాల్సి ఉంటుంది.
ముంబైలోని వాంఖేడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు ధోనీ సారథ్యంలోని సీఎస్కే సన్నద్ధమవుతోంది. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే జట్టు తొలిసారిగా గత ఏడాది ప్లే ఆఫ్స్ చేరడంలో విఫలమైంది. సీజన్‌ను సైతం ఏడవ స్థానంతో ముగించింది. దీంతో ఐపీఎల్ 2021 టైటిల్ లక్ష్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ బరిలోకి దిగింది.
Also Read: Corona Positive Cases: తెలంగాణలో కొత్తగా 6500 పైగా కరోనా కేసులు, 20 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook