IPL 2021 Final Match: క్రికెట్ లవర్స్ దృష్టి ఇప్పుడు కేవలం ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్‌పైనే ఉంది. ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్‌కు దుబాయ్ స్టేడియం సిద్ధమైంది. చెన్నై వర్సెస్ కోల్‌కత్తా ఫైనల్ పోరులో ఏ జట్టుకు అనుకూల పరిస్థితులున్నాయి, టాస్ కీలకం కానుందా లేదా అనేది పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోల్‌కత్తా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders)వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్. మరి కాస్సేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021(IPL 2021 Final)లో ఫైనల్ మ్యాచ్. నాలుగోసారి కప్ కప్ కొట్టేందుకు చెన్నై సూపర్‌కింగ్స్, మూడోసారి టైటిల్ సాధనకై కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్లు సిద్ధమయ్యాయి. సీఎస్‌కే జట్టు ఇప్పటికి 9 సార్లు ఫైనల్‌కు చేరితే..కేకేఆర్ మాత్రం ప్లే ఆఫ్స్‌కే కష్టంగా చేరి ఫైనల్‌కు చేరింది. బ్యాటింగ్‌లో సీఎస్‌కే జట్టు, బౌలింగ్‌లో కేకేఆర్ జట్టు బలంగా ఉన్న తరుణంలో ఐపీఎల్ విన్నర్ టైటిల్ ఎవరికి దక్కే అవకాశాలున్నాయో పరిశీలిద్దాం. ఈ ఫైనల్ పోరులో టాస్ కీలకం కానుందని మాత్రం తెలుస్తోంది. 


చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్, డుఫ్లెసిస్, జడేజా వంటి ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక కెప్టెన్‌గా ధోని(Dhoni)వ్యూహాలు టీమ్‌కు బలంగా మారనున్నాయి. ఇప్పటికే టైటిల్ మూడుసార్లు గెలవడం, 9 సార్లు ఫైనల్‌కు చేరడమనేది సీఎస్‌కే జట్టు సామర్ధ్యాన్ని చెబుతున్నాయి. అదే సమయంలో మోర్గాన్ టీమ్ అయిన కేకేఆర్ జట్టును కూడా తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే అసలు ప్లే ఆఫ్‌కు చేరుతుందా లేదా అనే సందిగ్దం నుంచి బయటపడి..ముఖ్యంగా రెండవ దశలో అద్బుతంగా రాణిస్తూ వచ్చింది కేకేఆర్ జట్టు. కేకేఆర్ జట్టు ఓపెనర్లు శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. అటు స్పిన్నర్లుగా ఉన్న వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్‌లు అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. 


ఇక విజయాలు, అపజయాల గురించి మాట్లాడితే సీఎస్‌కే జట్టు పైచేయి సాధించింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Superkings), కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్లు రెండుసార్లు తలపడగా..సీఎస్‌కే జట్టే విజయం సాధించింది. మొత్తం క్యాష్ రిచ్ లీగ్‌లో కేకేఆర్ వర్సెస్ సీఎస్‌కే జట్లు 25 సార్లు తలపడితే..16 సార్లు చెన్నై, 8 సార్లు కోల్‌కత్తా విజయం సాధించాయి. ఇక ఫైనల్ మ్యాచ్ జరగనున్న దుబాయ్ పిచ్‌పై టీ20 రికార్డు ఎలా ఉందనేది ఓసారి చూద్దాం. ఇప్పటి వరకూ టీ20 మ్యాచ్‌లు 105 జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసి విజయం సాధించిన జట్లు 41 అయితే, లక్ష్యసాధనకు దిగి విజయం సాధించిన జట్లు 61గా ఉన్నాయి. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఈ పిచ్ పై అత్యధిక స్కోరు 219 కాగా అత్యల్పం 59 మాత్రమే. సరాసరి ఇన్నింగ్స్ పరుగులు ఈ పిచ్‌పై 156గా ఉంది. ఇక ఈ సీజన్‌లో ఇదే స్డేడియంలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు..ఢిల్లీ క్యాపిటల్స్‌పై(Delhi Capitals)4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈసారి కూడా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టే విజయం సాధించబోతుందా లేదా అనేది చూడాలి. ఇటు ఫైనల్ బరిలో తలపడుతున్న జట్లు కూడా ఆ సెంటిమెంట్ ఆధారంగా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకుంటాయా లేదా అనేది కీలకంగా మారనుంది. 


Also read: IPL 2021 Final: ఐపీఎల్ 2021 ఫైనల్ పోరుకు కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు ఇదేనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి