IPL 2021 Final: ఐపీఎల్ 2021 ఫైనల్ పోరుకు కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు ఇదేనా

IPL 2021 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి పోరు వచ్చేసింది. ఇవాళ జరగనున్న ఐపీఎల్ 2021 ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. చెన్నై, కోల్‌కత్తా జట్లు ఐపీఎల్ 2021 టైటిల్ కోసం ఇవాళ పోరాడబోతున్నాయి. ఐపీఎల్ 2021 ఫైనల్‌లో కోల్‌కత్తా ఫైనల్ జట్టు ఇదే

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 15, 2021, 09:16 AM IST
  • ఐపీఎల్ 2021 ఫైనల్ పోరుకు సర్వం సిద్ధం
  • టైటిల్ పోరు కోసం అమీతుమీ తేల్చుకోనున్న కేకేఆర్, సీఎస్‌కే జట్లు
  • ఐపీఎల్ 2021 ఫైనల్ పోరుకు సిద్ధమైన కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు ఇదే
 IPL 2021 Final: ఐపీఎల్ 2021 ఫైనల్ పోరుకు కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు ఇదేనా

IPL 2021 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి పోరు వచ్చేసింది. ఇవాళ జరగనున్న ఐపీఎల్ 2021 ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. చెన్నై, కోల్‌కత్తా జట్లు ఐపీఎల్ 2021 టైటిల్ కోసం ఇవాళ పోరాడబోతున్నాయి. ఐపీఎల్ 2021 ఫైనల్‌లో కోల్‌కత్తా ఫైనల్ జట్టు ఇదే

IPL 2021 Final తుదిపోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Superkings)వర్సెస్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా అక్టోబర్ 15 రాత్రి అంటే ఇవాళ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు పైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 7 గంటలకు టాస్ ఉంటుంది. క్వాలిఫైయర్-1 లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ నేరుగా ఫైనల్‌కు చేరింది. అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఎలిమినేటర్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని క్వాలిఫైయర్-2లో ఓడించిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ తుదిపోరుకు చేరింది. దేశమంతా దసరా ఉత్సవాల్లో మునిగి ఉన్నవేళ..చెన్నై, కోల్‌కత్తా జట్లు హోరాహోరీ తలపడనున్నాయి. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మ్యాజిక్ మరోసారి పని చేస్తుందా లేదా మోర్గాన్ సేన వ్యూహం ఫలిస్తుందా అనేది చూడాలి. 

కోల్‌కత్తా నైట్ రైడర్స్(Kolkatta Nightriders)జట్టు అతికష్టం మీదే ఫైనల్స్‌కు చేరింది. లీగ్ తొలి దశలో మోర్గాన్ సేన ప్రదర్శన క్లిష్టంగానే సాగింది. ఎందుకంటే తొలిదశలో జరిగిన 7 మ్యాచ్‌లలో కేవలం రెండే మ్యాచ్‌లు గెలిచింది. రెండవ దశలో ఏడు మ్యాచ్‌లలో ఐదింట విజయం సాధించింది. ఫలితంగా మొత్తం 7 మ్యాచ్‌ల విజయంతో 14 పాయింట్లు సాధించి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. అటు ముంబై ఇండియన్స్ కూడా 14 పాయింట్లు సాధించినా నెట్ రన్‌రేట్ విషయంలో మోర్గాన్ సేనకు అనుకూలమై..ప్లే ఆఫ్‌కు చేరింది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పోరు చాలా టఫ్‌గానే సాగింది. హోరాహోరీగా చివరి రెండు బంతుల వరకూ సాగిన పోటీలో గెలిచింది. ఇక క్వాలిఫైయర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై(Delhi Capitals Team) దాదాపు ఓటమి అంచునే నిలిచింది. అదృష్ఠవశాత్తూ రాహుల్ త్రిపాఠి సిక్సర్ మ్యాచ్‌ను గెలిపించింది. వెంకటేశ్ అయ్యర్ ఫామ్‌లో ఉండటంతో కేకేఆర్(KKR)జట్టుకు ప్లస్ అవుతోంది. ఇక శుభమన్ గిల్ హిట్స్ ఎలాగూ ఉంటాయి. రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణాలు సైతం మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక సీనియర్లైన ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్ మాత్రం ఇంకా ఫామ్‌లో రాలేదు. మోర్గాన్ ఫామ్‌లో వస్తే కేకేఆర్ జట్టుకు తిరుగుండదు. ఇక దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు సానుకూలం కాకపోవడంతో షకీబ్ ఆడతారా లేదా అనేది ఇంకా తెలియదు. 

కోల్‌కత్తా తుది జట్టు ఇలా ఉండనుందని తెలుస్తోంది. శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, షకిబ్ ఉల్ హసన్ లేదా ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఫెర్గూసన్, శివమ్ మావిలతో పైనల్ పోరుకు కేకేఆర్ రంగంలో దిగవచ్చు.

Also read: Burj Khalifa: బుర్జ్ ఖలీఫాపై మెరిసిన టీమిండియా కొత్త జెర్సీ..వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News