IPL 2021 Latest News: కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 మిగతా సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో మిగతా సీజన్ ఎప్పుడు ప్రారంభం కానున్నది, ఫైనల్ మ్యాచ్ తేదీపై సమాచారం అందినా స్పష్టత రావడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2021 సీజన్ మిగతా మ్యాచ్‌లను సెప్టెంబర్ 19న ప్రారంభించి అక్టోబర్ 15న ఫైనల్ నిర్వహించాలని భావిస్తోంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అందుకు అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదని తెలుస్తోంది. అక్టోబర్ 10 లోగా ఐపీఎల్ 2021 (IPL 2021 Suspension) మిగతా సీజన్ పూర్తి చేయాలని బీసీసీఐకి ఐసీసీ సూచించే అవకాశం ఉందని అంతర్జాతీయ, జాతీయ మీడియా రిపోర్టులు వస్తున్నాయి.


Also Read: Yuzvendra Chahal Trolls: భార్యతో వద్దు బ్రో, ద గ్రేట్ ఖలీతో ట్రై చేయాలంటూ యుజువేంద్ర చాహల్‌పై సెటైర్లు


ట్వంటీ20 వరల్డ్ కప్ నిర్వహణకు అవకాశాలపై ఐసీసీ అధికారులు యోచిస్తున్నారు. అక్టోబర్ - నవంబర్ నెలల్లో పొట్టి ప్రపంచ కప్ నిర్వహించేందుకు ఐసీసీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్ సాధ్యమైనంత త్వరగా పూర్తయితేనే టీ20 ప్రపంచ కప్ ఏర్పాట్లకు తగిన సమయం దొరుకుతుందని ఐపీఎల్ పాలక మండలి, బీసీసీఐ (BCCI) పెద్దలతో ఐసీసీ చర్చించనుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే డబుల్ హెడర్ మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుంది.


Also Read: IPL 2021 Final Match: ఐపీఎల్ సీజన్ 14 ఫైనల్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా, భారత్‌లో పండగే


గత ఏడాది సైతం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ఏ ఇబ్బంది లేకుండా విజయవంతంగా నిర్వహించారు. కనుక ఈ ఏడాది మిగతా ఐపీఎల్ 2021 మ్యాచ్‌లను యూఏఈలోని అబుదాబి, దుబాయ్, మరో వేదికలో నిర్వహించేందుకు అరబ్ ఎమిరెట్స్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ పెద్దలు ఇదివరకే చర్చలు జరిపారు. అయితే మ్యాచ్‌ల తేదీలపై త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది. ఐపీఎల్ ప్రేమికులు సైతం షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook