T20 World Cup 2021: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ 2021 నిర్వహణ కష్టతరమవుతోంది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ మండలి (International Cricket Council) వరల్డ్ కప్ నిర్వహణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అభిప్రాయాన్ని కోరంది. తమకు నెల రోజుల గడువు ఇవ్వాలని ఇటీవల బీసీసీఐ చేసిన విన్నపాన్ని ఐసీసీ అంగీకరించింది.
జూన్ 1న వర్చువల్ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా పాల్గొన్నారు. టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ - నవంబర్ నెలలోనే నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని గంగూలీ ఐసీసీ అధికారులకు తెలిపాడు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో నిర్వహించడం సాధ్యమవుతుందా లేదో నిర్ణయం తీసుకోవడానికి గడువు కోరగా జూన్ 28 వరకు సమయం ఇచ్చారు. సమావేశం అనంతరం ఏఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నిర్ణయం తీసుకోవడానికి తమకు జూన్ 28 వరకు ఐసీసీ గడువు ఇచ్చిందని సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) వెల్లడించారు.
Also Read: Virat Kohli About Vegan: కోడిగుడ్ల వివాదంపై Team India కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే
ఒకవేళ భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ మొదలైతే ఇక్కడ టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2021) నిర్వహణ బీసీసీఐకి సాధ్యమవకపోతే యూఏఈకి వేదిక మారే అవకాశాలున్నాయి. ఐపీఎల్ 2021 పూర్తయిన వెంటనే అక్కడే టీ20 వరల్డ్ కప్ నిర్వహించడానికి యోచన మొదలైంది. ఐపీఎల్ అక్టోబర్ 10న ముగియగా, ఆ తరువాత అదే వేదికలలో పొట్టి ప్రపంచ కప్ నిర్వహణపై సైతం బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు ఒమన్ మస్కట్‌లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలని ప్రత్యామ్నాయ వేదికగా ఐసీసీ భావిస్తోంది.
Also Read: Nicholas Pooran Wedding: ప్రేయసిని వివాహం చేసుకున్న వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook