Yuzvendra Chahal Trolls: భార్యతో వద్దు బ్రో, ద గ్రేట్ ఖలీతో ట్రై చేయాలంటూ యుజువేంద్ర చాహల్‌పై సెటైర్లు

Yuzvendra Chahal Trolls: భారత బౌలర్ యుజువేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. చాహల్‌పై కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 8, 2021, 03:03 PM IST
  • భార్యతో కలిసి టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్‌ వర్కవుట్స్
  • తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్ పోస్ట్ చేసిన వీడియో ట్రెండింగ్ అవుతోంది
  • భార్య ధనశ్రీ వర్మతో కాదు బ్రో, ఖలీతో ట్రై చేయాలని నెటిజన్ల ట్రోలింగ్
Yuzvendra Chahal Trolls: భార్యతో వద్దు బ్రో, ద గ్రేట్ ఖలీతో ట్రై చేయాలంటూ యుజువేంద్ర చాహల్‌పై సెటైర్లు

Yuzvendra Chahal Trolls: టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తోటి క్రికెటర్లపై సైతం సరదాగా జోక్స్ వేస్తూ ఆటపట్టిస్తుంటాడు. గత ఏడాది నుంచి చాహల్‌కు భార్య భార్య ధనశ్రీ వర్మ మద్దతు తోడైంది. వీరిద్దరూ రెగ్యూలర్ అప్‌డేట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటారు. తాజా వీడియోపై కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

యుజువేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి ఇంట్లో వర్కవుట్స్ చేశాడు. ఈ వీడియోను నేడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో భారత (Team India) బౌలర్ చాహల్ (Yuzvendra Chahal) పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఓవైపు భారీగా లైక్స్, షేర్లతో పాటు కామెంట్లు వస్తుండగా, కొంతమేర ట్రోలింగ్ సైతం జరుగుతోంది. 'ప్రతిరోజూ శిక్షణ ద్వారా నేను కొన్ని విషయాలు మార్చగలను' అని క్యాప్షన్‌‌తో పోస్ట్ చేశాడు చాహల్. దీంతో బాడీ షేమింగ్ కామెంట్లు, సలహాలు సూచనలు కామెంట్లలో పోస్ట్ చేస్తున్నారు.

 Also Read: IPL 2021 Final Match: ఐపీఎల్ సీజన్ 14 ఫైనల్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా, భారత్‌లో పండగే

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

చాహల్ భాయ్.. భార్యత ధనశ్రీ వర్మ (Dhanashree Verma Photos)తో కాదు ద గ్రేట్ ఖలీతో కలిసి వర్కవుట్ చేయాలంటూ ట్రోల్ చేస్తున్నారు. మీరు భార్యతో కలిసి వర్కవుట్ చేయడం కంటే గ్రేట్ ఖలీ (The Great Khali)తో కలిసి ట్రైనింగ్ తీసుకుంటే మరింత ప్రయోజనం ఉండేదని కామెంట్ చేశారు. చాహల్ భాయ్.. ఇకనైనా కొంచెం బరువు పెరగాలి, అయితే ఈ విషయంలో తప్పుగా అనుకోవద్దు బ్రో అంటూ మనసులో మాటను బయటపెడుతున్నారు నెటిజన్లు. చాహల్ వీడియోలపై నెటిజన్లు ఫన్నీగా స్పందించడం సాధారణంగా మారింది.

Also Read: IPL 2021 Suspension: టీ20 లీగ్స్‌పై CSK ఆటగాడు Faf du Plessis కీలక వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News