IPL 2021: Pat Cummins ఐపీఎల్ మధ్యలోనే విడిచి వెళ్తాడా, క్లారిటీ ఇచ్చిన ఆల్ రౌండర్
IPL 2021 KKR Player Pat Cummins | ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాట్ కమిన్స్ కరోనా పోరాటానికి తమవంతు సాయంగా 50 వేల అమెరికా డాలర్లు పీఎం కేర్స్ నిధులకు జమ చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగే ప్రసక్తే లేదని కేకేఆర్ స్టార్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ స్పష్టం చేశాడు.
కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న భారత్‌కు తన వంతు సాయాన్ని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ అందించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాట్ కమిన్స్ కరోనా పోరాటానికి తమవంతు సాయంగా 50 వేల అమెరికా డాలర్లు పీఎం కేర్స్ నిధులకు జమ చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. తోటి ఆస్ట్రేలియా క్రికెటర్లు కరోనా పరిస్థితుల్లో భారత్‌లో ఉండలేమంటూ ఐపీఎల్ నుంచి మధ్యలోనే వైదొలిగారు.
ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగే ప్రసక్తే లేదని కేకేఆర్ స్టార్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ స్పష్టం చేశాడు. తాజాగా వియాన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిన్స్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు సాయం కొనసాగుతూనే ఉందని పాట్ కమిన్స్ పేర్కొన్నాడు. 50 వేల డాలర్లు చేయడం తన బాధ్యత అని చెప్పడం గమనార్హం. గత కొన్నేళ్లుగా తాను భారత్‌లో మ్యాచ్‌లు ఆడుతున్నానని, ఐపీఎల్ 2021లో తాను కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు తెలిపాడు.
Also Read: CSK vs SRH match highlights: రెచ్చిపోయిన గైక్వాడ్, డుప్లెసిస్.. సన్‌రైజర్స్‌పై చెన్నై విజయం
గత కొన్నేళ్లుగా తాను ఐపీఎల్ ఆటగాడిగా భారత్‌తో అనుబంధం పెరిగిందని, బయట పరిస్థితి అంత బాగాలేకపోవడంతో విరాళం అందించినట్లు పాట్ కమిన్స్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలోనే ఉందని, తనను ఆదరించిన భారత అభిమానులకు అండగా నిలవాలని భావించినట్లు చెప్పాడు. తాను చేసింది కొంతమాత్రమేనని, అది కొందరి అవసరాలైనా తీర్చితే తనకు సంతోషమన్నాడు. ఐపీఎల్ నుంచి తాను మధ్యలోనే వైదొలిగే ప్రసక్తే లేదన్నాడు.
మేము 3, 4 గంటలు మాత్రమే మ్యాచ్ ఆడతామని, కానీ ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తన వంతు సాయం చేశానని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు ఛారిటీల ద్వారా సైతం సాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించాడు.కేకేఆర్ జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు వక్తి వంచన లేకుండా ప్రదర్శన చేస్తానంటున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో పాట్ కమిన్స్ ఒకడని తెలిసిందే.
Also Read: ICC Bans Nuwan Zoysa: ఫిక్సింగ్ కేసులో ఐపీఎల్ మాజీ ఆటగాడు నువాన్ జోయ్‌సాపై 6 ఏళ్ల నిషేధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook