ఐపీఎల్ 2020 రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఎదురుదెబ్బ తగిలింది. రూ.12 లక్షల భారీ జరిమానాకు గురయ్యాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం రోహిత్ శర్మకు జరిమానా విధించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను నిలువరించేందుకు బౌలింగ్ మార్పులకు ముంబై జట్టు అధిక సమయం తీసుకుంది. స్లో ఓవర్ రేటుతో బౌలింగ్ చేసిన కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ 2021లో జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్ ఎంఎస్ ధోనీ కాగా రెండో కెప్టెన్‌‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నిలిచాడు. మరోవైపు రోహిత్ ఫీల్డ్ నుంచి కాసేపు తప్పుకోవడంతో కీరన్ పోలార్డ్ తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ క్రమంలో ముంబై జట్టు బౌలింగ్ కోటా పూర్తి చేయడానిక నిర్ణీత సమయం కన్నా అధిక సమయం తీసుకుంది.


Also Read: IPL 2021: ఫిట్‌నెస్ లేదని నాపై ఫిర్యాదులు రాలేదు, సంతోషం: ఎంఎస్ ధోనీ


ఒకవేళ ముంబై ఇండియన్స్ జట్టు IPL 2021లో తదుపరి రెండు మ్యాచ్‌లలో మరోసారి స్లో ఓవర్ రేటుతో కనుక బౌలింగ్ చేసినట్లయితే ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.24 లక్షల జరిమానా విధించారు. ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లకు వారి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం లేదా రూ.6లక్షలు (ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తం) జరిమానా విధిస్తారు. మూడో పర్యాయం ఈ తప్పిదం చేస్తే కెప్టెన్‌కు రూ.30 లక్సల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. జట్టు ఆటగాళ్లకు రూ.12 లక్షల జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత (ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తం) ఫైన్ వేస్తారు.


మ్యాచ్ ముగిసిన తరువాత అంపైర్లు, మ్యాచ్ రిఫరీ చర్చించి జరిమానా విధిస్తారు. లేదా కొన్ని పర్యాయాలు అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేస్తే, పరిశీలించిన అనంతరం జరిమానా, లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని తెలిసిందే. చెన్నైలోని ఎంఏ చిదరంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో విజయం ద్వారా పాయింట్ల పట్లికలో రెండో స్థానానికి ఢిల్లీ క్యాపిటల్స్ చేరుకుంది. మొత్తం 4 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 3 విజయాలు అందుకుంది. 4 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్‌లలో నెగ్గి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 3 మ్యాచ్‌లలో విజయం సాధించి అగ్రస్థానంలో ఉంది.


Also Read: IPL 2021 Funny Memes: జానీ బెయిర్‌స్టో హిట్ వికెట్‌పై పేలుతున్న జోక్స్, Viral అవుతున్న ఫన్నీ మీమ్స్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook