IPL 2021: గాయం నుంచి కోలుకుని ఐపీఎల్‌కు సిద్ధమైన స్టార్ పేసర్ మహమ్మద్ షమీ
Mohammed Shami Latest Update : ఈ జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న అనిల్ కుంబ్లే ఓ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. పంజాబ్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఐపీఎల్ 2021లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని కుంబ్లే వెల్లడించాడు.
పంజాబ్ ఫ్రాంచైజీ ఈ ఏడాది తమ పేరు మార్చుకుని లక్ పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరును పంజాబ్ కింగ్స్‌గా మార్చుకుంది. ఈ జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న అనిల్ కుంబ్లే ఓ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. పంజాబ్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఐపీఎల్ 2021లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని కుంబ్లే వెల్లడించాడు.
టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ గాయాల కారణంగా గత కొంతకాలం నుంచి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2021(IPL 2021)కు సన్నద్ధమయ్యాడని, త్వరలోనే పంజాబ్ కింగ్స్ జట్టుతో షమీ చేరబోతున్నాడని ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో ఆడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు సందర్భంగా గాయపడిన షమీ అప్పటినుంచి మైదానంలో అడుగు పెట్టలేదని తెలిసిందే.
Also Read: ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం
నేషనల్ క్రికెట్ అకాడమీలో గత కొంతకాలం నుంచి మహమ్మద్ షమీ శిక్షణ పొందుతున్నాడు. బయో సెక్యూర్ వాతావరణంలో కోలుకుంటున్న షమీ ఫిట్‌నెస్‌తో పాటు తన బౌలింగ్‌పై ఫోకస్ చేస్తున్నాడు. గాయం నుంచి షమీ(Mohammed Shami) కోలుకున్నాడని, త్వరలోనే క్వారంటైన్ ముగించుకుని పంజాబ్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెడతామని కుంబ్లే వివరించాడు. స్పోర్ట్స్‌స్టార్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2021కు ముందే షమీతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడించాలని భావిస్తున్నట్లు తెలిపాడు.
ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు భారీగా ఖర్చు చేసి ఆటగాళ్లను తీసుకుంది. జై రిచర్డ్‌సన్, రిలే మెరెడిత్‌లను వరుసగా రూ.14కోట్లు, రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. మోసెస్ హెన్రిక్స్ లాంటి పేస్ ఆల్ రౌండర్‌ను రూ.4.2 కోట్లకు దక్కించుకుంది. వారితో పాటు రిటెయిన్ ఆటగాళ్లు క్రిస్ జోర్డాన్, అర్షదీప్ సింగ్, ఇషాన్ పోరెల్, దర్శన్ నల్కండే లాంటి ఆటగాళ్లు ఉన్నారు.
Also Read: Gold Price Today 28 March 2021: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, దిగొచ్చిన వెండి ధరలు
వికెట్ కీపింగ్‌లో తొలి ప్రాధాన్యం కేఎల్ రాహుల్‌కు ఇస్తున్నారు. రాహుల్ తరువాతే నికోలస్ పూరణ్, ప్రభసిమ్రన్ సింగ్‌ల పేర్లు పరిశీలిస్తామని కుంబ్లే స్పష్టం చేశాడు. ఏప్రిల్ 12న జరగనున్న తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్స్ కింగ్స్ తలపడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook