Mohammed Shami: సిక్సర్లతో బౌలర్లను వణికించిన మహమ్మద్ షమీ!

పేస్ బౌలర్ మహ్మద్ షమీ పుట్టినరోజు నేడు (Happy Birthday Mohammed Shami). 30వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా స్టార్ బౌలర్ షమీకి బీసీసీఐ, ఐసీసీ శుభాకాంక్షలు తెలిపాయి. షమీ బర్త్ డే సందర్భంగా తమ స్టార్ బౌలర్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంజాబ్ టీమ్ వెల్లడించింది.  

Written by - Shankar Dukanam | Last Updated : Sep 3, 2020, 06:08 PM IST
  • నేడు భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ పుట్టిన రోజు
  • ప్రస్తుతం ఐపీఎల్ 2020 ఆడేందుకు యూఏఈలో ఉన్న షమీ
  • షమీ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది పంజాబ్ టీమ్
Mohammed Shami: సిక్సర్లతో బౌలర్లను వణికించిన మహమ్మద్ షమీ!

భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ పుట్టినరోజు (Happy Birthday Mohammed Shami) నేడు. 30వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా స్టార్ బౌలర్ షమీకి బీసీసీఐ, ఐసీసీ శుభాకాంక్షలు తెలిపాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2020 ఆడేందుకు షమీ.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీతో యూఏఈలో ఉన్న విషయం తెలిసిందే. షమీ బర్త్ డే సందర్భంగా తమ స్టార్ బౌలర్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంజాబ్ టీమ్ వెల్లడించింది. మోడల్ Padma Lakshmi 50వ బర్త్‌డే.. బికినీ ఫొటోలతో ట్రీట్ 

ఓసారి షమీ సోదరుడు హసీబ్ జిల్లా స్థాయి క్రికెట్ ఆడుతున్నాడు. ఓ ప్లేయర్ తక్కువ కావడంతో తమ్ముడు బౌలర్ అయినప్పటికీ బ్యాట్స్‌మెన్ స్థానంలో షమీని జట్టులోకి తీసకున్నాడు హసీబ్. తొలి మ్యాచ్‌లోనే బ్యాటింగ్ అవకాశం లభించింది. తాను టెన్నిస్ బాల్‌తో ఆడానని, కార్క్ బాల్‌తో ఆడటం వీలు కాదని చెప్పినా వినిపించుకోలేదు. టెన్నిస్ బాల్‌ను బాదినట్లే ఈ బంతిని కొట్టాలని షమీకి సూచించాడు. IPL 2020: యూఏఈలో మరోసారి కరోనా కలకలం

షమీ తొలి బంతికే సిక్సర్ బాదేశాడు. అదే ఊపులో ఆ మ్యాచ్‌లో 14 సిక్సర్లతో బౌలర్లను ఉతికారేశాడు షమీ అంటూ పంజాబ్ జట్టు బౌలర్ బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. దాంతో క్రికెట్‌పై ఆసక్తి పెరిగినా.. వ్యక్తిగత ఇష్టంతో బౌలింగ్‌నే కెరీర్‌గా ఎంచుకున్నట్లు షమీ తెలిపాడు. Virat Kohli: బ్యాట్ పట్టాలంటే భయం వేసింది: కోహ్లీ

వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న టీమిండియా బౌలర్ అంటూ షమీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది బీసీసీఐ. 49 టెస్టులు, 77 వన్డేలు, 11టీ20లలో కలిపి 336 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు షమీ.  టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics 

2019 వన్డే ప్రపంచ కప్‌లో అఫ్గానిస్తాన్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీసిన షమీకి బర్త్ డే స్పెషల్ అంటూ అందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ పోస్ట్ చేసింది. Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్ 
Anchor Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు

BCCI: దిక్కుతోచని స్థితిలో బీసీసీఐ!
IPL 2020 ప్రారంభానికి ముందే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ

 

Trending News