IPL 2021 Rajasthan Royals: సంజూ శాంసన్‌కు ప్రమోషన్.. స్టీవ్ స్మిత్‌కు షాక్!
IPL 2021 Rajasthan Royals: Sanju Samson named RRs New captain: ఐపీఎల్ 2008లో టైటిల్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతోంది. మరోసారి టైటిల్ నెగ్గాలన్న యోచనతో యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ సంజూ శాంసన్‌కు కెప్టెన్‌గా కీలక బాధ్యతలు అప్పగించింది. రాజస్థాన్ ఫ్రాంచైజీ స్టీవ్ స్మిత్‌ను వదులుకుంది.
IPL 2021 Rajasthan Royals: Sanju Samson named RRs New captain: ఐపీఎల్ గత సీజన్‌లో తీవ్రంగా నిరాశ పరిచిన రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2021 సీజన్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై వేటు వేసింది. ఏకంగా ఫ్రాంచైజీ నుంచి రిలీజ్ చేయడం గమనార్హం. అదే సమయంలో యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ అప్పగించింది.
యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో తొలుత కొన్ని మ్యాచ్‌లలో రాణించిన కీలక ఆటగాడు స్టీవ్ స్మిత్.. అనంతరం చెప్పుకోదగ్గ ఆట ఆడలేదు. 14 మ్యాచ్‌ల్లో 311 రన్స్ చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2013 నుంచి రాజస్థాన్ జట్టుతో కొనసాగిన స్టీవ్ స్మిత్ మధ్యలో స్పాట్ ఫిక్సింగ్ సమయంలో రాజస్థాన్ జట్టుపై నిషేధం విధించగా.. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కు Steve Smith ప్రాతినిథ్యం వహించాడు.
Also Read: Rishabh Pant: గబ్బాలో సూపర్ ఇన్నింగ్స్.. రిషబ్ పంత్ అరుదైన ఘనత
ఫిబ్రవరి రెండో వారంలో ఐపీఎల్ 2021కు వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇతర జట్లు కీలక ఆటగాళ్లకు షాకిచ్చాయి. కానీ స్టీవ్ స్మిత్‌కు కెప్టెన్సీ నుంచి తొలగించడం, జట్టు నుంచి సైతం వదిలేసింది రాజస్థాన్. తొలి ఐపీఎల్ 2008లో టైటిల్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతోంది. మరోసారి టైటిల్ నెగ్గాలన్న యోచనతో యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ సంజూ శాంసన్(Sanju Samson)కు కెప్టెన్‌గా కీలక బాధ్యతలు అప్పగించింది.
Also Read: Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 32 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
టాపార్డర్, మిడిలార్డర్ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి ప్రత్యర్థి బౌలింగ్‌ను తుత్తునియలు చేయగల సమర్థుడు సంజూ శాంసన్. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, రాబిన్ ఉతప్ప లాంటి ఆటగాళ్లపై రాజస్థాన్ విశ్వాసం ఉంచింది. వీరితో పాటు రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, డేవిడ్ మిల్లర్, జయదేవ్ ఉనద్కత్, ఆండ్రూ టై జట్టులో ఉన్నారు. Also Read: COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్నా.. వీరికి అంతగా పనిచేయదు!
స్టీవ్ స్మిత్‌తో పాటు ఒషానే థామస్, ఆకాష్ సింగ్, వరుణ్ ఆరోన్, టామ్ కరన్, అనిరుద్ధా జోషి, శశాంక్ సింగ్‌లను రాజస్థాన్ ఫ్రాంచైజీ వదులుకుంది. వీరి వద్ద ప్రస్తుతం రూ.34.85 కోట్లు ఉన్నాయి. అతి తక్కువ మొత్తం రూ.10.75 కోట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook