Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 32 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్

 టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుతం చేశారు. నిర్ణయాత్మక చివరిదైన నాలుగో టెస్టులో 3 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. తద్వారా బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌ను 2-1 తో అజింక్య రహానే సేన సొంతం చేసుకుని రికార్డులు తిరగరాసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 19, 2021, 02:28 PM IST
  • ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుతం చేశారు
  • చివరిదైన నాలుగో టెస్టులో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ విజయం
  • బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌ను 2-1 తో అజింక్య రహానే సేన సొంతం చేసుకుంది
Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 32 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్

Team India Registers Historic Win Against Australia In 4th Test: టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుతం చేశారు. నిర్ణయాత్మక చివరిదైన నాలుగో టెస్టులో 3 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. తద్వారా బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌ను 2-1 తో అజింక్య రహానే సేన సొంతం చేసుకుని రికార్డులు తిరగరాసింది.

గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్(Rishabh Pant) 89 పరుగులతో చివరివరకు నిలిచి టీమిండియా అపూర్వ విజయాన్ని అందించాడు. తొలి టెస్టు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్(22) మెరుపులు మెరిపించడంతో పంత్ విజయతీరాలకు చేర్చి భారత జట్టుతో పాటు దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకునేలా చేశాడు.  

Also Read: Rishabh Pant: ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలుకొట్టిన రిషబ్ పంత్

32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓటమి
గబ్బా వేదికగా జరిగిన మైదానంలో భారత్ విజయం సాధించడంతో ఆసీస్ రికార్డు చెల్లాచెదురైంది. బ్రిస్బేన్‌లో 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓటమి చెందింది. ఆసీస్‌ గడ్డపై ఈ రికార్డుకు బ్రేకులు చేసిన భారత జట్టు(Team India)కు ఇతర జట్ల ఆటగాళ్లు అభినందనలు తెలుపుతున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన చివరి టెస్టులో మరో 18 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని అందుకుంది. 

Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ 

తొలుత ఓపెనర్ రోహిత్ శర్మ(7) త్వరగా ఔటైనా శుభ్‌మన్‌ గిల్‌(91; 146 బంతుల్లో 8 ఫోర్లు ,2 సిక్సర్లు), చటేశ్వర్ పుజారా(56; 211 బంతుల్లో 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కీలక సమయాల్లో ఔట్ అవుతాడని విమర్శలు ఎదుర్కొనే రిషబ్ పంత్ (89నాటౌట్‌; 138 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) బ్రిస్బేన్ టెస్టులో ఓపికగా ఆడుతూ జట్టును గెలిపించడంతో పాటు బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని అందించాడు. 

Also Read: Hike Messaging APP: హైక్ మెసేజింగ్ యాప్ షట్ డౌన్.. యాప్ సేవలు బంద్

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 369 ఆలౌట్‌
టీమిండియా‌ తొలి ఇన్నింగ్స్‌ : 336 ఆలౌట్‌
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 294 ఆలౌట్‌
టీమిండియా‌ రెండో ఇన్నింగ్స్‌ : 329/7

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x