IPL 2021 Schedule: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తాజాగా ఐపీఎల్ 14వ సీజన్ పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 9న ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. గత ఏడాది కరోనా కారణంగా 6 నెలలు ఆలస్యంగా ఐపీఎల్ ప్రారంభమైంది. ప్రస్తుతం మాత్రం ఏ ఆలస్యం లేకుండా షెడ్యూల్ విడుదల చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మే 30న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2021 (IPL 2021) ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే ఇప్పటివరకూ జరిగిన సీజన్ల మాదిరిగా సొంత వేదిక అడ్వాండేజ్ లేదని ఐపీఎల్ పాలకమండలి, బీసీసీఐ స్పష్టం చేశాయి. సొంత వేదికలలో ఏ జట్టు మ్యాచ్ ఆడే ప్రసక్తే లేకుండా ఐపీఎల్ 14 సీజన్ మ్యాచ్‌లు షెడ్యూల్ చేశారు.


Also Read: IPL 2021 MI Schedule: ఐపీఎల్ 2021 ముంబై ఇండియన్స్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్


కేవలం ఆరు నగరాలు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై మరియు కోల్‌కతా నగరాలలోనే ఐపీఎల్ 2021 సీజన్ జరగనుంది. అయితే లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లకుగానూ అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలో 8 చొప్పున మ్యాచ్‌లు జరగనుండగా, మిగిలిన నాలుగు వేదికలైన ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై వేదికలలో 10 చొప్పున మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 6 వేదికలలో ఒక్కో జట్టు 4 వేదికలలో మ్యాచ్‌లు ఆడనుంది.


Also Read: Womens Day 2021 Wishes: నారీమణులకు వుమెన్స్ డే విషెస్ ఇలా తెలపండి


కాగా, మ్యాచ్ టైమింగ్స్‌ను రాత్రి 7:30 గంటలకు, సాయంత్రం 3:30 గంటలకు ప్రారంభం అయ్యేలా షెడ్యూల్ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు తమ తొలి మ్యాచ్‌ మరియు చివరి మ్యాచ్‌లోనూ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. లీగ్ దశలో ఏప్రిల్ 11న తొలి మ్యాచ్, చివరి మ్యాచ్ మే 21న కోల్‌కతా జట్టుతో సన్‌రైజర్స్ అమీతుమీ తేల్చుకోనుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook