Dale Steyn Apologises: ఐపీఎల్‌పై సంచన వ్యాఖ్యలు, ఎట్టకేలకు క్షమాపణ చెప్పిన స్టార్ పేసర్ డెల్ స్టెయిన్

Dale Steyn Apologises For Comments Against IPL 2021 | సంచలన వ్యాఖ్యలు చేసిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డెల్ స్టెయిన్ ఎట్టకేలకు వెనక్కి తగ్గాడు. తన మాటలు ఎవరిరైనా బాధపడితే తనను క్షమించాలని కోరాడు. 

Written by - Shankar Dukanam | Last Updated : Mar 3, 2021, 04:51 PM IST
Dale Steyn Apologises: ఐపీఎల్‌పై సంచన వ్యాఖ్యలు, ఎట్టకేలకు క్షమాపణ చెప్పిన స్టార్ పేసర్ డెల్ స్టెయిన్

Dale Steyn Apologises For Comments Against IPL 2021: దేశంలో అత్యంత ఖరీదైన టీ20 టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)పై సంచలన వ్యాఖ్యలు చేసిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డెల్ స్టెయిన్ ఎట్టకేలకు వెనక్కి తగ్గాడు. తన మాటలు ఎవరిరైనా బాధపడితే తనను క్షమించాలని కోరాడు. ఈ మేరకు తన తప్పిదం తెలుసుకుని డెల్ స్టెయిన్  క్షమాపణ కోరిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ఐపీఎల్.. ఎంతో మంది యవకులకు జీవితాన్ని ఇచ్చింది. అదే సమయంలో హీరోలుగా వచ్చి ప్రదర్శన చేయకపోవడంతో జీరో అయిన క్రికెటర్లు సైతం ఉన్నారు. ఐపీఎల్ ద్వారా కేవలం మాత్రమే సంపాదించగలమని, అందులో పెద్దగా చేసిది లేదని.. దానికన్నా పాకిస్తాన్ సూపర్ లీగ్(Pakistan Super League) బెస్ట్ అంటూ దక్షిణాఫ్రికాకు చెందిన 37ఏళ్ల పేసర్ డెల్ స్టెయిన్(Dale Steyn) సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో స్టెయిన్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Also Read: Jasprit Bumrah Marriage: పెళ్లిపీటలు ఎక్కనున్న Team India పేసర్ జస్ప్రిత్ బుమ్రా, BCCIకి సమాచారంతో విశ్రాంతి

‘నా కెరీర్‌లో ఐపీఎల్(IPL 2021) వల్ల కొన్ని రోజుల సమయంలో సాధించింది తక్కువేమీ కాదు. ఇతర క్రికెటర్లకు సైతం ఇది వర్తిస్తుంది. అయితే ఈ వ్యాఖ్యలు ఇతరులను విమర్శించడంగానీ, స్థాయి తక్కువ చేసి మాట్లాడటం కాదు. ఎవరినీ అవమాన పరచయలేదు. నా మాటల ద్వారా ఎవరైనా బాధపడితే అందుకు నన్ను క్షమించండి’ అంటూ తాజాగా మరో ట్వీట్ చేశాడు సఫారీ బౌలర్ స్టెయిన్.

Also Read: Dhanashree Verma Photos: మాల్దీవులలో భార్యతో టీమిండియా స్పిన్నర్ Yuzvendra Chahal, వైరల్ అవుతున్న ఫొటోషూట్

ఐపీఎల్ గురించి స్టెయిన్ ఏమన్నాడంటే.. క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్(IPL 2021)లో పెద్ద పేరున్న క్రికెటర్లు చాలా మంది ఆడతారు. ఆటగాళ్లకు ఊహించిన దాని కన్నా అధికంగా డబ్బు అందుతుందన్నాడు. కానీ అదే సమయంలో ఆట పట్ల ఆసక్తి తగ్గుతుందని, ఇందులో మెరుగైన ప్రదర్శనను ఆటగాళ్ల నుంచి ఆశించడం కష్టమేనంటూ’ డెల్ స్టెయిన్ వ్యాఖ్యానించాడు. గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించినా స్థాయి మేరకు ప్రదర్శన చేయలేకపోయాడు.

Also Read: Team India: ఇంగ్లాడ్‌తో నాలుగో టెస్టుకు, వన్డే సిరీస్‌కు టీమిండియా పేసర్ Jasprit Bumrah దూరం

తాను ఐపీఎల్ 2021కు దూరంగా ఉండాలని భావిస్తున్నానంటూ ముందుగానే నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ నుంచి విశ్రాంతి తీసుకున్నా, ఇతర టీ20 లీగ్స్ ఆడేందుకు ఆసక్తి కనబరచడంతో బెంగళూరు సైతం డెల్ స్టెయిన్‌ను ఈ ఏడాది వేలానికి ముందుగానే రిలీజ్ చేసింది. ఐపీఎల్ కెరీర్‌లో 95 మ్యాచ్‌లలో 97 వికెట్లు సాధించాడు.

Also Read: Hardik Pandya: భార్య Natasa Stankovic‌తో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫొటోషూట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News