IPL 2021: ఐపీఎల్ ప్రేమికులకు శుభవార్త, సెప్టెంబర్‌లో మిగతా మ్యాచ్‌ల నిర్వహణ
తొలుత సెప్టెంబర్ 15 నుంచి ఐపీఎల్ సీజన్ 14 మిగతా మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసఐ, ఐపీఎల్ పెద్దలు భావించారు. కానీ ఆ సమయానికి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ షెడ్యూల్ పూర్తికాదన్న కారణంగా మూడో వారంలో ఐపీఎల్ 2021 మిగతా సీజన్ ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని ఓ అధికారి వెల్లడించారు.
కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తొలిసారిగా మ్యాచ్‌లు నిరవధికంగా వాయిదా వేశారు. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం ఐపీఎల్ 2021 మిగతా సీజన్‌ను కచ్చితంగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి తెలిపారు.
తొలుత సెప్టెంబర్ 15 నుంచి ఐపీఎల్ సీజన్ 14 మిగతా మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసఐ, ఐపీఎల్ పెద్దలు భావించారు. కానీ ఆ సమయానికి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ షెడ్యూల్ పూర్తికాదన్న కారణంగా మూడో వారంలో ఐపీఎల్ 2021 మిగతా సీజన్ ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని ఓ అధికారి వెల్లడించారు. దీంతో క్రికెట్ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 18 లేదా 19న యూఏఈ వేదికగా IPL 2021 మిగతా మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. మూడు వారాల వ్యవధిలో ప్లే ఆఫ్స్, క్వాలిఫయర్స్, ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Also Read: IPL 2021: కరోనా సోకడంతో కన్నీటిపర్యంతమైన ఐపీఎల్ క్రికెటర్ టిమ్ సీఫర్ట్
ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 9 లేదా అక్టోబర్ 10న నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 10 రోజులు డబుల్ హెడర్ మ్యాచ్‌లు అంటే 20 మ్యాచ్‌లు నిర్వహించి ఐపీఎల్ సీజన్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు సన్నాహకాలు బీసీసీఐ (BCCI) మొదలుపెట్టింది. ఇంగ్లాండ్‌లో నిర్వహించాలని భావించగా, అక్కడ భారీ ఖర్చులు కారణంగా లాభాలు తగ్గే అవకాశం ఉండటంతో యూఏఈని వేదికగా చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
Also Read: ICC WTC Final: టీమిండియా ఓపెనర్ Rohit Sharmaకు మాజీ కోచ్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook