IPL 2021: ఐపీఎల్ నిర్వహణపై చిగురిస్తున్న ఆశలు, అన్నీ కుదిరితే ఈసారి కొత్త వేదికలో టీ20 టోర్నీ

IPL 2021 Latest News: కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్‌లను నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్ మిగతా సీజన్ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.

Written by - Shankar Dukanam | Last Updated : May 20, 2021, 02:45 PM IST
IPL 2021: ఐపీఎల్ నిర్వహణపై చిగురిస్తున్న ఆశలు, అన్నీ కుదిరితే ఈసారి కొత్త వేదికలో టీ20 టోర్నీ

IPL 2021 Latest News: క్రికెట్ అభిమానులకు త్వరలో శుభవార్త రానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)పై ఆశలు చిగురిస్తున్నాయి. కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్‌లను నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్ మిగతా సీజన్ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.

గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో ఐపీఎల్ 2020 నిర్వహించడం సాధ్యం కాని పక్షంలో యూఏఈ వేదికగా నిర్వహించారు. ఈ ఏడాది మాత్రం భారత్‌లో నిర్వహించడం మైనస్ పాయింట్ అయింది. నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్ 2021ను ఇంగ్లాండ్ (England), యూకే వేదికగా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఓ అధికారి తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లు నిర్వహించకపోతే వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని, మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఆడేందుకు భారత ఆటగాళ్లు త్వరలో ఇంగ్లాండ్‌ పయనం కానున్నారు. యూకే ప్రభుత్వం సైతం ఐపీఎల్ తదుపరి మ్యాచ్‌ల నిర్వహణకు తాము సిద్ధమేనని గతంలోనే ముందుకొచ్చింది.

Also Read: Asia Cup 2021 Cancel: కరోనా ఎఫెక్ట్, ఆసియా కప్ రద్దు చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డ్

ఒకవేళ బీసీసీఐ, ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) చర్చలు సఫలమైతే టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న 5 టెస్టుల సిరీస్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రస్తుతం క్రికెట్ బోర్డుల ఉన్నతాధికారులు ఐపీఎల్ 2021 (IPL 2021) తదుపరి మ్యాచ్‌ల నిర్వహణ, టెస్ట్ సిరీస్‌పై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్‌లో స్టేడియాలకు వీక్షకులను అనుమతిస్తున్నారు. దాని ద్వారా టికెట్ల నగదు సైతం ఇంగ్లాండ్ బోర్డుకు ప్లస్ పాయింట్ కానుంది. పరస్పర అంగీకారం కుదిరితే టెస్టు సిరీస్‌ తరువాత ఐపీఎల్ సీజన్ 14 మిగతా మ్యాచ్‌లు నిర్వహిణకు మార్గం సుగమం కానుంది. 

Also Read: Ashes Series Schedule: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ షెడ్యూల్ ప్రకటించిన ఈసీబీ

ఒకవేళ భారత్‌లో ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లు నిర్వహించినా ఇంగ్లాండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం కష్టమేనని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు ఇదివరకే పేర్కొంది. కనుక ఇంగ్లాండ్ వేదికగానే ఐపీఎల్ జరగనుందని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News