IPL 2021: LIVE మ్యాచ్‌లో పిచ్ పై పడుకున్న స్మిత్.. మీమ్స్ తో హోరెత్తిన ట్విట్టర్
ఢిల్లీ క్యాపిటల్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగున్న LIVE మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ పిచ్ పై పడుకోవటం... ట్విట్టర్ లో దీనిపై మీమ్స్ వర్షం కురుస్తుంది. ఆ ఫన్నీ మీమ్స్ ఏంటో మీరు కూడా చూసేయండి మరీ!
Memes on Steve Smith: కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య మంగళవారం జరిగిన ఐపిఎల్ (IPL 2021) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ మైదానంలో పిచ్ పై గాయం కారణంగా పిచ్ పై పోడుకున్నాడు. ఇపుడు ఆ సంఘటనపై సోషల్ మీడియాలో చాలా రకాల మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరఫున ఆడుతున్న స్టీవ్ స్మిత్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) బౌలర్ లాకీ ఫెర్గూసన్ వేసిన ఒక బంతికి, షాట్ మిస్ అవ్వటం, బంతి తగలటంతో నేలపై పడుకున్నాడు.
ఆకస్మిక ప్రమాదం
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పృథ్వీ షా (Prithvi Shaw) స్థానంలో ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కు (Australian player Steve Smith) చోటు దక్కింది. . శిఖర్ ధావన్‌తో (Shikhar Dhawan) కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టీవ్ స్మిత్ మొదటి వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 39 పరుగులు చేసిన తరువాత స్టీవ్ స్మిత్ లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Also Read: Online Gold: కేవలం రూ.100 కే బంగారం.. ఎగబడుతున్న జనం
స్కూప్ షాట్ ఆడుతూ గాయం
ఐపిఎల్ (IPL 2021) లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఇన్నింగ్స్‌లో, కెకెఆర్ టీం (KKR Team) ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ (Fast Bowler Lockie Ferguson) 13 వ ఓవర్‌లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు మొదటి బంతికి స్మిత్ స్కూప్ షాట్ ఆడే క్రమంలో తనను తాను గాయపర్చుకున్నాడు. షాట్ ఆడే ప్రయత్నంలో బాల్ స్మిత్ (Steve Smith) తొడ భాగానికి తగలటంతో అక్కడే పిచ్ పై పడుకున్నాడు. అలా గ్రౌండ్ పై పడుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ ఆయింది. 34 బంతుల్లో 39 పరుగులు చేసిన స్మిత్ 4 ఫోర్లు కొట్టాడు.
3 వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మూడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను (Delhi Capitals) ఓడించింది. టాస్ గెలిచిన కెకెఆర్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ (KKR captain Eoin Morgan) మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 127 పరుగులు చేసింది. లక్ష్యాన్ని చేధనలో కేకేఆర్ 18.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసి మ్యాచ్ లో గెలిచింది.
Also Read: LIVE Suicide Attempt Video:వేగంగా వస్తున్న రైలు..పట్టాలపై నిలుచున్న యువతి.. ఏం జరిగింది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి