IPL 2021: సన్‌రైజర్స్‌కు షాక్‌.. తండ్రి మరణంతో ఇంటి దారి పట్టిన స్టార్‌ ఆల్‌రౌండర్‌!

IPL 2021: సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్‌ షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ జట్టుకు దూరం కానున్నాడు. తన తండ్రి కన్నుమూయడంతో స్వదేశానికి(విండిస్) వెళ్లనున్నాడు. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్‌ జట్టుకు ఇది ఉహించని షాక్ అనే చెప్పాలి.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2021, 05:02 PM IST
  • సన్‌రైజర్స్‌కు బిగ్‌ షాక్‌
  • తండ్రి మరణంతో ఇంటి దారి పట్టిన విండీస్ ఆటగాడు
  • ఇప్పటికే జట్టుకు నటరాజ్, విజయ్ శంకర్ లు దూరం
IPL 2021: సన్‌రైజర్స్‌కు షాక్‌.. తండ్రి మరణంతో ఇంటి దారి పట్టిన స్టార్‌ ఆల్‌రౌండర్‌!

Rutherford returns home after death of his father: వరుస ఓటములతో ప్లే ఆఫ్‌ ఆశలను దాదాపుగా గల్లంతు చేసుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు(ఎస్‌ఆర్‌హెచ్‌) మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జానీ బెయిర్‌స్టో స్థానంలో ఇటీవలే (ఐపీఎల్‌-2021 రెండో దశ) జట్టులోకి వచ్చిన విండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌(Rutherford).. తన తండ్రి కన్నుమూయడంతో స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది గట్టి ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

వారి స్థానాలు ఎవరు భర్తీ చేస్తారో...
అయితే రెండో దశ తొలి మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్‌(Sunrisers Hyderabad)కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు లీగ్‌కు దూరమయ్యారు. కరోనా బారిన పడడంతో స్టార్ బౌలర్ నటరాజన్ (Natarajan)జట్టుకు దూరం కాగా, అతనితో సన్నిహితంగా మెలిగిన విజయ్ శంకర్(Vijay Shankar) కూడా ఐసొలేషన్‌లోకి వెళ్లాడు. తాజాగా రూథర్‌ఫర్డ్‌ కూడా లీగ్‌కు దూరం కావడంతో ఈ ముగ్గురి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారోనని ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Also Read: IPL 2021: సన్‌రైజర్స్‌పై ఢిల్లీ గెలుపు...టాప్‌లోకి పంత్ సేన..

ఇదిలా ఉంటే, రెండో దశ తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) చేతిలో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేయగా.. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు మాత్రమే నష్టపోయి మరో 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా డీసీ జట్టు 8 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. కాగా, శనివారం(సెప్టెంబర్‌ 25) జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News