Online Gold: కేవలం రూ.100 కే బంగారం.. ఎగబడుతున్న జనం

రూ. 100 బంగారం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ?? అవునండి, కరోనా సంక్షోభం తరువాత డిజిటల్ గోల్డ్ అమ్మకాలు ఊపందుకున్నాయి. డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? ఎలా కొనాలి? ప్రయోజానాలేంటో మీరే తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2021, 02:47 PM IST
  • కరోనా సంక్షోభం తరువాత ఊపందుకున్న ఆన్‌లైన్‌ గోల్డ్
  • ఒక్క రూపాయికి కూడా బంగారం కొనవచ్చు
  • భారత్ లో డిజిటల్ గోల్డ్ కు పెరుగుతున్న మార్కెట్
Online Gold: కేవలం రూ.100 కే బంగారం.. ఎగబడుతున్న జనం

Digital Gold: కరోనా సంక్షోభం (Corona Crisis) తరువాత బంగారం కొనులు క్రమంగా పట్టాలేక్కుతుంది, ఇదీవరకు మన దేశంలో బంగారం కొనాలంటే తప్పకుండా షాపు వరకు వెళ్లాల్సిందే. కానీ కరోనా సమయంలో లాక్ డౌన్ కారంణంగా ఆన్‌లైన్‌ బంగారం కొనుగోలు పెరిగింది. జనాలు కూడా డిజిటల్ గోల్డ్ (Digital Gold) పైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఫలితంగా, బంగారం అమ్మే వారు కూడా వారి రూటును మార్చారు. 

డిజిటల్ బంగారం

కరోనా మాహమ్మారి వలన ఆన్లైన్ విక్రయాలు (Online market) అపుడే దేశంలో డిజిటల్ గోల్డ్ (Digital Gold) వ్యాపారానికి భీజం పడింది. బంగారాన్ని భౌతికంగా కాకుండా డిజిటల్ గా కొనుగోలు చేయవచ్చు.  ఆన్‌లైన్‌లో మీకు నచ్చిన మొత్తంలో అనగా రూ.1, రూ.10, రూ.100, రూ.1000 ఇలా ఎంత మొత్తంలో అయిన బంగారాన్ని కొనవచ్చు. మీరు కానీ ఒక గ్రాము బంగారం మొత్తం చెల్లించిన తరువాత బంగారం మీ ఇంటికి డెలివరీ అవుతుంది.  ఫోన్ పే (Phone pay), గూగల్ పే (Google Pay), పేటీఎం (Paytm) వంటి మొబైల్ యాప్ ల ద్వారా డిజిటల్ బంగారం కొనుగోలు చేయొచ్చు. 

 Also Read: LIVE Suicide Attempt Video:వేగంగా వస్తున్న రైలు..పట్టాలపై నిలుచున్న యువతి.. ఏం జరిగింది..?

డిజిటల్ బంగారం కొనుగోలు 
బంగారం ధరలు పరుగులు పెడుతున్న నేపథ్యంలో వస్తువు రూపంలో కొనాలంటే కనీసం 10 వేలైన అవసరం అవుతుంది. కానీ, ఒక్క రూపాయి ఉన్నా.. డిజిటల్ బంగారం (Digital Gold) కొనొచ్చు. భౌతిక బంగారం క్వాలిటీలో చాలా రకాలు ఉంటాయి. ధరలు ఒకేలా ఉండవు. కానీ, డిజిటల్ బంగారానికి ఇలాంటి సమస్యలు లేవు. డిమాండ్ బట్టి విలువ మారుతుంది. దీనిని స్యూరిటీగా పెట్టి బ్యాంక్ లో లోన్లు కూడా పొందొచ్చు. స్థానిక పరిణామాలు బంగారం ధరలను నియంత్రించే అవకాశం ఉంటుంది. కానీ, వీటి ధరలు అంతర్జాతీయ మార్కెట్ (International gold market) తో అనుసంధానమై ఉంటాయి. కావాలి అనుకున్నప్పుడు వీటిని అమ్మటమే కాకుండా వస్తువు రూపంలో కూడా దీన్ని పొందొచ్చు. ఇలాంటి ప్రయోజనాల కారణంగా ఇటీవల డిజిటల్ బంగారం కొనుగోలుకు ఎక్కువ మంది ఆశక్తి చూపిస్తున్నారు. 

సెంకో గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ (Senco Gold and Diamonds), కల్యాణ్‌ జువెల్లర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (Kalyan Jewellers India Limited ), తనిష్క్‌ (Tanisha Jewellers),  పీసీ జువెల్లర్‌ లిమిటెడ్‌ (PC Jewellers), డిజిటల్ గోల్డ్ ను ఆన్‌లైన్‌లో విక్రయించటం ప్రారంభించాయి. కేవలం 100 రూపాయలు ఉన్న కుడా బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున చాలా మంది డిజిటల్ గోల్డ్ పై మక్కువ చూపుతున్నారు. ఆన్‌లైన్‌లో వారి అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా విక్రయాలు ప్రారంభించటం వల్ల డిజిటల్ గోల్డ్ ఊపందుకుంది. అంతేకాకుండా మీ దగ్గర ఉన్న డబ్బు మేరకు మాత్రమే కొనుగోలు చేయొచ్చు. కాకపోతే మీరు కనుక ఒక గ్రాము బంగారం డబ్బులు జమ చేసిన వెంటనే వారు మీ బంగారాన్ని డోర్ డెలివరీ చేస్తారు. 

Also Read: Bank Holidays October 2021: వచ్చే నెలలో 21 రోజులు పాటు బ్యాంకులకు సెలవులు...బి అలర్ట్

ఇలాంటి డిజిటల్ గోల్డ్ అమ్మకాలు కొత్తేమీ కాదు, ఇదివరకు ఆగ్మొంట్‌ గోల్డ్‌ లిమిటెడ్‌ (Augmont Gold Limited), ఎంఎంటీసీ-పీఎఎంపీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (MTC-PAMP India Pvt Ltd), డిజిటల్‌ గోల్డ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు (Digital gold india private limited) డిజిటల్ బంగారాన్ని అందిస్తున్నాయి. కానీ బంగారం షాపు వాళ్లు మాత్రం దీనికి కొద్దిగా వెనకబడి ఉన్న లాక్ డౌన్ తరువాత వారు కూడా డిజిటల్ గోల్డ్ వైపు తమ ఆసక్తిని కనబరుస్తున్నారు. 

రాబోయే దసరా (dussehra), దీపావళి (Dewali) పండుగల సందర్భంగా డిజిటల్ గోల్డ్ (Digital Gold) అమ్మకాలు జోరుగాసాగుతున్నాయి. ఎక్కువగా యువత డిజిటల్ గోల్డ్ వైపే మొగ్గుచుపతంతో ఆన్‌లైన్‌ కొనుగులు చాలా మట్టుకు పెరిగింది. ఫిబ్రవరి 2020 నుండి డిజిటల్ గోల్డ్ కొనుగోలు 20 శాతం పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. 

Also Read: Genelia: వల్గర్‌ ఆంటీ అంటూ జెనీలియాపై ట్రోలింగ్‌.. ఘాటుగా స్పందించిన జెనీలియా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News