Kane Williamson takes charge of SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపిల్ 2021 సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు మ్యాచ్‌లు ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్‌ని కెప్టేన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తూ అతడి స్థానంలో కేన్ విలియమ్సన్‌కి జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ సీజన్‌లో మిగతా అన్ని మ్యాచులకు కేన్ విలియమ్సన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టేన్‌గా వ్యవహరించనున్నాడు. ఐపిఎల్ 14వ సీజన్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ సారధ్యంలో జట్టు వరుస పరాజయాలు మూటగట్టుకోవడం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచులలో డేవిడ్ వార్నర్ ఒక్కో మ్యాచ్‌లో 3, 54, 36, 37, 6, 57 చొప్పున స్కోర్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉండగా మరో రెండు సింగిల్ డిజిట్ స్కోర్స్ కూడా ఉన్నాయి.



Also read : PBKS vs RCB in IPL 2021: ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం


ఈ నిర్ణయం అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదని, ఎన్నో ఏళ్లుగా డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సేవలు అందించాడని, అతనిపై తమకు ఎప్పుడూ గౌరవం అలాగే ఉంటుందని సన్ రైజర్స్ హైదరాబాద్ అభిప్రాయపడింది. ఈ సీజన్‌లోని మిగతా మ్యాచుల్లోనూ డేవిడ్ వార్నర్ (David Warner) సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ ప్రకటనలో పేర్కొంది. 


రాజస్థాన్ రాయల్స్‌తో రేపు జరిగే మ్యాచులోనూ ఓవర్సీస్ కాంబినేషన్‌లో మార్పులు ఉంటాయని సన్ రైజర్స్ (Sunrisers Hyderabad) స్పష్టంచేసింది. డేవిడ్ వార్నర్ స్థానంలో వెస్ట్ ఇండీస్ కెప్టేన్ జేసన్ హోల్డర్ (Jason Holder) పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook