Jonny Bairstow ఆ సమయంలో బాత్రూమ్‌లో ఉన్నాడా, SRH నిర్ణయాన్ని తప్పుపట్టిన సెహ్వాగ్

DC Beats SRH In Super Over | జానీ బెయిర్‌స్టో లాంటి ఆటగాడు సూపర్ ఓవర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఫస్ట్ ఛాయిస్ ఎందుకు కాదో తనకు అర్ధం కాలేదన్నాడు సెహ్వాగ్. 18 బంతుల్లో 38 పరుగులు చేసిన అతడికి బదులు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌ను బ్యాటింగ్‌కు పంపి వినూత్న ప్రయోగాలు చేసినందుకు జట్టు భారీ మూల్యం చెల్లించుకుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 26, 2021, 04:21 PM IST
Jonny Bairstow ఆ సమయంలో బాత్రూమ్‌లో ఉన్నాడా, SRH నిర్ణయాన్ని తప్పుపట్టిన సెహ్వాగ్

DC Beats SRH In Super Over | సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యధిక వేగంగా ఈ మార్కు చేరుకున్న నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం రాత్రి ఆడిన మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 38 పరుగులు సాధించాడు. కేన్ విలియమ్సన్ అజేయ హాఫ్ సెంచరీ చేసినా సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ను కేవలం టై చేసింది. సూపర్ ఓవర్‌లో స్వీయ తప్పిదాలతో ఓటమి చవిచూసింది.

సూపర్ ఓవర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, కెప్టెన్ డేవిడ్ వార్నర్ తీసుకున్న నిర్ణయాలు జట్టు కొంప ముంచాయని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. జానీ బెయిర్‌స్టో లాంటి ఆటగాడిని మీరు సూపర్ ఓవర్ ఎందుకు ఆడిందచలేదని, ఆ సమయంలో ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ బాత్రూమ్‌లో ఉన్నాడా ఏంటి అని సూటిగా ప్రశ్నించాడు. స్వీయ తప్పిదాలకు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) భారీ మూల్యం చెల్లించుకుందని ట్వీట్ చేశాడు. అద్భుతమైన ఫామ్, స్ట్రైక్ రేట్ ఉన్న జానీ బెయిర్‌స్టోను వదిలేసి సన్‌రైజర్స్ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగడాన్ని సెహ్వాగ్ తప్పుపట్టాడు.

Also Read: Ravichandran Ashwin: ఐపీఎల్ 2021 నుంచి విరామం తీసుకున్న రవిచంద్రన్ అశ్విన్, రీ ఎంట్రీ డౌట్

జానీ బెయిర్‌స్టో లాంటి ఆటగాడు సూపర్ ఓవర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఫస్ట్ ఛాయిస్ ఎందుకు కాదో తనకు అర్ధం కాలేదన్నాడు సెహ్వాగ్. 18 బంతుల్లో 38 పరుగులు చేసిన అతడికి బదులు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌ను బ్యాటింగ్‌కు పంపి వినూత్న ప్రయోగాలు చేసినందుకు జట్టు భారీ మూల్యం చెల్లించుకుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2021(IPL 2021) పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ 7వ స్థానంలో కొనసాగుతోంది. 

మొత్తంగా 5 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి 2 పాయింట్లతో ఉంది. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏప్రిల్ 28న ఈ మ్యాచ్ జరగనుంది. కేన్ విలియమ్సన్ జట్టులోకి వచ్చాక సన్‌రైజర్స్ పోరాటం మొదలుపెట్టింది. కానీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, మేనేజ్‌మెంట్ అనాలోచిత నిర్ణయాలు, మిడిలార్డర్ వైఫల్యం సన్‌రైజర్స్ ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

Also Read: Ravindra Jadeja 36 Runs In 1 over: రవీంద్ర జడేజా విధ్వంసం, ఒక్క ఓవర్‌లో 37 పరుగులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News