కరోనా సెకండ్ వేవ్‌‌లో భారత్‌లో పరిస్థితి చూసి విదేశీ క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు ముగ్గురు ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు ఆండ్రూ టై, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన కేన్ రిచర్డ్‌సన్, ఆడం జంపా అత్యంత ఖరీదైన టీ20 లీగ్ నుంచి వైదొలిగారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ప్రజలు చనిపోతుంటే మీకు ఐపీఎల్ అవసరమా అంటూ ఆండ్రూ టై ఘాటుగానే ప్రశ్నించాడు. మరికొందరు కరోనా నేపథ్యంలో సీజన్ ఆరంభానికి ముందే ఐపీఎల్ 2021 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు, మరణాల నేపథ్యంలో విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ ముగిసిన తరువాత తమ పరిస్థితి ఎలా ఉండబోతుందోనని కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీఓఓ హేమంగ్ అమిన్ స్పందించారు. ‘విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ 2021(IPL 2021) ముగిసిన తరువాత తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. అయితే విదేశీ ఆటగాళ్లకు ఏ సమస్య ఉండదని, ఇంటికి తిరిగి ఎలా వెళ్లాలనే భయాలు అక్కర్లేదని’ చెప్పారు.


Also Read: T20 World Cup: భారత్‌లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించడం సాధ్యం కాకపోతే మరో వేదిక


ఆటగాళ్ల ఆరోగ్యం పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎప్పుడూ శ్రద్ధ తీసుకుంటుందున్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై బీసీసీఐ ఎప్పటికప్పుడూ సమీక్ష జరుపుతుంది. ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి ఆటగాళ్ల ఆరోగ్యానికి మరింత భద్రత కల్పిస్తామని చెప్పారు. ఐపీఎల్ తాజా సీజన్ ముగిసిన అనంతరం విదేశీ ఆటగాళ్లను వారి దేశాలకు తిరిగి పంపించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అందుకు తగిన ఏర్పాట్లు మొత్తం బీసీసీఐ చూసుకుంటుందని విదేశీ క్రికెటర్లకు హామీ ఇచ్చారు.


Also Read: Ramu Passes Away: కరోనాతో ప్రముఖ నిర్మాత, Actress Malashree భర్త రాము కన్నుమూత


విదేశీ ఆటగాళ్లు ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరుకునేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుందని, ఆందోళన వదిలేసి ఆటపై ఫోకస్ చేసి ఫలితాలు రాబట్టాలని సూచించారు. ఆస్ట్రేలియా దేశం మే 15వరకు భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించడం తెలిసిందే. ఇలాంటి కారణాలతోనే విదేశీ ఆటగాళ్లు సాధ్యమైనంత త్వరగా తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని భావిస్తున్నారని కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ డేవిడ్ హస్సీ తెలిపాడు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను క్షేమంగా వారి ఇళ్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని బీసీసీఐ సీఓఓ హేమంగ్ అమిన్ ప్రకటించారు.


మరోవైపు 14 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇంకా ఐపీఎల్ 2021లో కొనసాగుతున్నారు. వారిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు స్టీవ్ స్మిత్, సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఆటగాడు డేవిడ్ వార్నర్, కేకేఆర్ ఆటగాడు పాట్ కమిన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్, ఆర్సీబీ కోచ్ సమైన్ కటిచ్, కామెంటెటర్లు మాథ్యూ హెడెన్, బ్రెట్ లీ, మైఖెల్ స్లేటర్, లిసా స్తాల్కర్, తదితరులు ఉన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook