Veda Krishnamurthy Mother Death News : భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. రోజూ 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, 2 వేలకు పైగా కోవిడ్19 మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సెలబ్రిటీలు సైతం కరోనా మహమ్మారి కష్టాలను భారీ స్థాయిలోనే ఎదుర్కొంటున్నారు. ఇటీవల కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు. కొన్ని చోట్ల కొందరు చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ ఇంట్లో విషాదం నెలకొంది.
టీమిండియా మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి ఇంట్లో విషాదం నెలకొంది. మహిళా క్రికెటర్ తల్లి చెలువాంబ్డా దేవి శనివారం తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా బారిన పడిన చెలువాంబ్డా దేవి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో కోవిడ్19తో ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెటర్ వేద కృష్ణమూర్తి తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. వేద కృష్ణమూర్తి భారత జాతీయ జట్టుకు 48 వన్డేలు, 76 టీ20 మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించింది.
Also Read: హైదరాబాద్ మాజీ క్రికెటర్ Ashwin Yadav కన్నుమూత
Appreciate all the messages I have received about the loss of my Amma. As you can imagine my family is lost without her. We now pray for my sister. I have tested negative & appreciate if you can respect our privacy. My thoughts & prayers go out to those going through the same!!
— Veda Krishnamurthy (@vedakmurthy08) April 24, 2021
తన తల్లి ప్రాణాలతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించిన వారికి, కష్టకాలంలో తమకు మద్దతుగా నిలిచిన అందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది. తన తల్లి లేకుండా కుబుంబాన్ని ఊహించుకోలేమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన సోదరి సైతం కరోనా బారిన పడ్డారని, ఆమె కోవిడ్19 మహమ్మారిని జయించి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థించాలని కోరారు. తమ కుటుంబానికి కొంత ప్రైవసీ దొరుకుతుందని ఆశిస్తున్నానంటూ’ టీమిండియా క్రికెటర్ వేద కృష్ణమూర్తి ట్వీట్ చేసింది.
Also Read: Jwala Gutta Wedding Photos: ఘనంగా గుత్తా జ్వాల, హీరో విష్ణు విశాల్ వివాహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook