AB De Villiers: మనసు మార్చుకున్న ఏబీ డివిలియర్స్, ఆర్సీబీతో మరోసారి ఒప్పందమా
AB De Villiers: ఐపీఎల్ 2022 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అభిమానులకు ఇది గుడ్‌న్యూస్. ఆ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
AB De Villiers: ఐపీఎల్ 2022 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అభిమానులకు ఇది గుడ్‌న్యూస్. ఆ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 త్వరలో ప్రారంభమయ్యేందుకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది. ఈసారి ఐపీఎల్‌లో కొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఎంట్రీ ఇస్తున్నాయి. మెగా ఆక్షన్ ఫిబ్రవరి 12, 13 తేదీల్లోనే ముగిసినా..ఇంకా అన్ని జట్లలో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. వేలంలో మిగిలిన ఆటగాళ్లను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ప్రధానమైన మార్పు రావచ్చని సమాచారం. అదే జరిగితే క్రికెట్ ప్రేమికులకు పండగే.
విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న దక్షిణాఫ్రికా బ్యాటర్ ఏబీ డివిలియర్స్. పరిచయం అవసరం లేని వ్యక్తి. గత ఏడాది అంటే 2021 ఐపీఎల్ తరువాత క్రికెట్‌లోని అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి అభిమానులను నిరాశకు గురి చేశాడు. ఇది కేవలం దక్షిణాఫ్రికా ప్రజలకే కాకుండా ఐపీఎల్ ప్రేమించేవాళ్లందరికీ షాక్. మరీ ముఖ్యంగా ఆర్సీబీ జట్టుకు. ఇప్పుడు ఏబీ డివిలియర్స్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్ కోసం మరోసారి ఆర్సీబీ జట్టు కోసం ఆడవచ్చనేది పక్కా సమాచారం. అయితే కోచ్‌గా రావచ్చని తెలుస్తోంది. అంటే ఏబీ డివిలియర్స్ ఆటను మాత్రం క్రికెట్ అభిమానులు పూర్తిగా మిస్సవ్వాల్సిందే.
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇంకా కెప్టెన్ ఎవరనేది ఖరారు కాలేదు. టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో...కొత్త కెప్టెన్ ఎంపిక చేసుకోవల్సి ఉంది. ఆర్సీబీ జట్టు కెప్టెన్ రేసులో ప్రస్తుతానికి డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ పేర్లు విన్పిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా జట్టు కోచ్‌గా ఏబీ డీవిలియర్స్ పేరు విన్పిస్తోంది. అదే జరిగితే ఆర్సీబీ బాటర్లకు మంచి స్ఫూర్తి కలుగుతుంది.
Also read: IND VS SL 2nd Test : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook