All-Rounder Mitchell Marsh to miss 3-4 more games for Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో వరుస విజయాలతో దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. తాజా సీజన్‌లో మాత్రం కాస్త తడబడుతోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, రెండు పరాజయాలు అందుకుని నాలుగు పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన గత మ్యాచులో విజయం సాధించిన ఢిల్లీ.. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలడపనుంది. ఈ మ్యాచుకు అందుబాటులోకి వస్తాడనుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్ మార్ష్..  ఇంకా గాయం నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 ప్రారంభమైనప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ముందుగా దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జ్ గాయం కారణంగా ప్రారంభ మ్యాచులు దూరమయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్‌ మిచెల్ మార్ష్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. పాకిస్తాన్ పర్యటనలో గాయపడిన మార్ష్.. ఏప్రిల్ 10న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని ఢిల్లీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ పేర్కొన్నా.. అది జరగలేదు. ఢిల్లీ ఆడే మరో 3-4 మ్యాచులకు అతడు దూరం కానున్నాడట. 


మిచెల్ మార్ష్ గాయంతో బాధపడుతుండడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరినప్పటికీ.. రిహాబిటేషన్‌ సెంటర్‌లో ఫిజియో పాట్రిక్‌ ఫర్హాత్‌ పర్యవేక్షణలో ఉన్నాడు. మార్ష్ పూర్తిగా కోలుకునేందుకు దాదాపుగా 7-10 రోజులు పట్టే అవకాశం ఉంది. అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మన్‌దీప్ సింగ్ మరియు శార్దూల్ ఠాకూర్ వంటి ఆల్‌రౌండర్‌లు జట్టుకు అందుబాటులో ఉన్నా.. మార్ష్ లేని వెలితి స్పష్టంగా కనిపిస్తోంది. మార్ష్ పేస్ బౌలింగ్, బ్యాటింగ్ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. 


ఐపీఎల్ 2022 మెగా వేలం సందర్భంగా మిచెల్ మార్ష్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ 2021 గెలవడంలో మార్ష్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ ఇన్నింగ్స్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అందుకే మార్ష్ త్వరగా కోలుకోవాలని ఢిల్లీ యాజమాన్యం కోరుకుంటోంది. 


Also Read: KA Paul: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చిత్తుచిత్తుగా ఓడడం ఖాయం.. కేసీఆర్‌కి ప్రత్యామ్యాయం నేనే: కేఏ పాల్


Also Read: KA Paul: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చిత్తుచిత్తుగా ఓడడం ఖాయం.. కేసీఆర్‌కి ప్రత్యామ్యాయం నేనే: కేఏ పాల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook