IPL 2022 auction and CSK retainers list: ఐపిఎల్ 2022 మెగా ఆక్షన్ కి తేదీ సమీపిస్తున్న కొద్దీ ఏయే ఫ్రాంచైజీ ఏయే ఆటగాళ్లను మళ్లీ రీటేన్ చేసుకుంటుందనే ఉత్కంఠ ఎక్కువైంది. మరీ ముఖ్యంగా పవర్ ప్యాక్డ్ పర్ ఫార్మెన్స్ అందించే చరిష్మా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ లాంటి స్టార్ ప్లేయర్స్ పైనే ఐపిఎల్ ప్రియుల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తమ జట్టులో కొనసాగుతున్న ఆటగాళ్లలో నలుగురిని వచ్చే ఏడాదికి కూడా కొనసాగించేందుకు ఐపిఎల్ ఫ్రాంచైజీలకు వీలు ఉంటుందనే సంగతి తెలిసిందే. వేలంతో (IPL 2022 mega auction) సంబంధం లేకుండా అలా రీటేన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 30వ తేదీలోగా ఆయా ఫ్రాంచైజీలు అందించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సైతం తమ జట్టులో వచ్చే ఏడాది ఐపిఎల్ టోర్నీలోనూ తమతో కలిసి ప్రయాణించే ఆ నలుగురు ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఆ జాబితాలో వారి సక్సెస్‌ఫుల్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు ముందు వరుసలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్ర సింగ్ ధోనీకి ఎంత ప్రాధాన్యం ఇస్తోందంటే.. రానున్న మరో మూడేళ్ల వరకు ధోనీని తమ జట్టులోనే (Dhoni in CSK for IPL 2022) కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఉన్నట్టు సమాచారం.


Also read: Rahul Dravid Bowling Video: నెట్స్​లో చెమటోడ్చిన ద్రావిడ్.. బౌలింగ్ మాములుగా లేదుగా (Rahul Dravid viral video)


ఎంఎస్ ధోనీతో (MS Dhoni) పాటు వచ్చే ఏడాది ఐపిఎల్ కోసం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) పేర్లు కూడా ఖరారయ్యాయి. ఐపిఎల్ 2021 టైటిల్ విన్నింగ్ రేసులో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings in IPL 2022) ధోనీ తర్వాత ఈ ఇద్దరికే అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. 


ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయీన్ అలీకి కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓనర్స్ (CSK in IPL 2022 auction) నుంచి కాల్ వెళ్లిందట. ఒకవేళ మొయీన్ అలీ ఆసక్తి చూపించనట్టయితే.. అతడి స్థానంలో ఇంగ్లాండ్ క్రికెటర్ శామ్ కుర్రాన్‌ని తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. అంతిమంగా ఏం జరగనుందో వేచిచూడాల్సిందే మరి.


Also read : IND Vs NZ: ఆ యువ ఆటగాడు ఉన్నాడు.. రాహుల్‌ లేని ప్రభావం జట్టుపై ఉండదు: రహానే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook